సినిమా హీరోయిన్లు వీరి మీద కామెంట్లు చేసినట్లుయితే ఏమి జరుగుతుంది. ఏమికాదు. హీరోయిన్లు వచ్చి మనల్ని అడగరు. సరిగదా. మనం ఎవరో తెలిసే చాన్స్ కూడా లేదు. దీనిని దృష్టిలో వుంచుకుని సైబర్ నేరగాళ్లు వ్యాపారం చేస్తున్నారు. తమ వెబ్ సైట్స్, బ్లాగ్ రెటింగ్ పెంచుకోవడానికి హీరోయిన్లు శరీరంను వాడుకుంటున్నారు. హీరోయిన్లు మీద అసభ్యకరమైన వ్యాఖ్యానాలు కూడా చేస్తున్నారు.
అయితే అలాంటి వాటికి చెక్ పెట్టేందుకు తెలంగాణ సీఐడీ విభాగం రంగంలోకి దిగింది. 'మా' ఇచ్చిన ఫిర్యాదు పైన పోలీసులు రంగంలోకి దిగి సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు సిద్ధమైన్నారు. సీఐడీ రంగంలోకి దిగిందని తెలుసుకున్న ఈ సైబర్ చీటర్స్ తమ దుకాణాలను మూసుకుని పారిపోయారు. అయితే సీఐడీ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కేసును పురోగతి సాధించింది.
ఉప్పల్ కు చెందిన రఘవరన్ అనే బీటెక్ విద్యార్ధి. ఇతనికి సరియైన ఉద్యోగం దొరకలేదు. దీంతో తన చేతిలో వున్న పనిని నమ్ముకున్నాడు. వెంటనే ఒక కంప్యూటర్ ను కొనుగోలు చేశాడు. ఒక వెబ్ సైట్ తో పాటుగా బ్లాగ్ ను ఏర్పాటు చేశాడు. ఈ వెబ్ సైట్, బ్లాగ్ వీవర్స్ పెరగాలంటే ఏమి చేయాలని ఆలోచన చేశాడు. దీంతో వెంటనే సినిమా రంగంపైన గాసిప్స్ రాసినట్లుయితే వీవర్స్ పెరుగుతారు.
దీనికి తోడుగా సినిమా హీరోయిన్స్ మీద కామెంట్లుతో పాటుగా సెక్స్ వ్యాఖ్యానాలు. పొటోలు పెడితే గిరాకీ బాగా వుంటుదని అనుకున్నాడు. వెంటనే ముందుగా చిన్న చిన్న హీరోయిన్ల ఫోటోలను మార్పింగ్ చేయడం మొదలు పెట్టి వాటిని తన సైట్ లో పెట్టాడు.
దీంతో సైట్ తోపాటుగా బ్లాగ్ కు వీవర్స్ పెరిగారు.. డబ్బులు రావడం మొదలు అయ్యాయి. ఇదే బిజినెస్ మంచిగా వుందని చెప్పి టాప్ హీరోయిన్ల నుంచి టీవీ యాంకర్ ల ఫోటోలను మార్పింగ్ చేయడంతో పాటుగా అసభ్యకరమైన పోస్టింగ్ లు పెట్టాడు. అయితే 'మా' ఇచ్చిన ఫిర్యాదులో రఘవరన్ మెయింటెన్ చేస్తున్న సైట్ లో చాలా మొత్తంలో సినిమా హీరోయిన్లు, హీరోలతో పాటుగా గాసిప్స్.. మార్పింగ్ ఫోటోలు వున్నట్లుగా గుర్తించిన సీఐడీ వెంటనే రఘవరన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
చాలామంది తమ జీవనం కొరకు ఇలాంటి వెబ్ సైట్స్ ను మెయింటెన్ చేస్తూ సినిమా రంగంలో వున్న వారిపైన చెడు వార్తలను ప్రచారం చేస్తున్నారని… ఇలాంటివి చాలా సైట్స్ వున్నాయని.. వాటి పైన కూడా కఠినంగా చర్యలు తీసుకునేందుకు చర్యలను ఆరంభించామని సీఐడి తెలిపింది.