సంపత్ నంది-బాలయ్య

బాలయ్య బాబుతో మాంచి మాస్ డైరక్టర్ కాంబినేషన్ సెట్ అయితే, ఆ సినిమాకు క్రేజ్ భలేగా వుంటుంది. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ నే సెట్ అయ్యేలా వుంది. రచ్చ, బెంగాల్ టైగర్ వంటి మాంచి…

బాలయ్య బాబుతో మాంచి మాస్ డైరక్టర్ కాంబినేషన్ సెట్ అయితే, ఆ సినిమాకు క్రేజ్ భలేగా వుంటుంది. ఇప్పుడు ఇలాంటి కాంబినేషన్ నే సెట్ అయ్యేలా వుంది. రచ్చ, బెంగాల్ టైగర్ వంటి మాంచి కమర్షియల్ సక్సెస్ లు అందించిన సంపత్ నంది ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయాలని తెగ ఆసక్తిగా వున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఓ కథ చెబుతా అని బాలయ్యకు రాయబారం పంపినట్లు తెలుస్తోంది. దానికి హీరో బాలకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

సబ్జెక్ట్ బాగుంటే, తనకు సంపత్ నందితో చేయడానికి అభ్యంతరం లేదని బాలకృష్ణ నుంచి వర్తమానం అందినట్లు బోగట్టా. ఇటీవలే జై సింహా సినిమాతో సక్సెస్ కొట్టిన నిర్మాత సి కళ్యాణ్ నిర్మించడానికి రెడీగా వున్నారు.

ఇక ఇప్పుడు బాల్ సంపత్ నంది కోర్టులోనే వుంది. సరైన స్క్రిప్ట్ తో బాలయ్యతో ఓకె చేయించుకోవాలి. ఓకె అయితే వెంటనే బండి పట్టాల మీదకు వస్తుంది.

నిజానికి ఇటీవల బాలయ్యతో అనిల్ రావిపూడి సినిమా అని గ్యాసిప్ బయటకు వచ్చింది. కానీ అది వర్కవుట్ కాలేదని, అనిల్ రావిపూడికి బాలయ్య ఎస్ ఆర్ నో రెండూ చెప్పలేదని తెలుస్తోంది. అనిల్ రావిపూడి యథాతథంగా వెంకీ-వరుణ్ తేజ మల్టీ స్టారర్ తోనే ముందుకు వెళ్తున్నారు.