బెల్లంకొండ శ్రీనివాస్-శ్రీవాస్ కాంబినేషన్ లో అభిషేక్ పిక్చర్స్ నిర్మిస్తున్న సాక్ష్యం సినిమా అదృష్టం బాగానే వున్నట్లుంది. ఇప్పటికే సినిమా హిందీ డబ్బింగ్, శాటిలైట్, డిజిటల్ హక్కులు 8కోట్లకు అమ్ముడుపోయాయి. ఇప్పుడు తెలుగు శాటిలైట్ హక్కులు అయిదున్నర కోట్లకు అమ్మేసారు. దీంతో థియేటర్ హక్కలు కాకుండానే 13కోట్లకు పైగా వచ్చినట్లయింది.
శ్రీవాస్ డైరక్షన్ లో చేస్తున్న ఈ సినిమాలో అయిదు భారీ ఫైట్లు వుంటాయి. మాంచి కమర్షియల్ హంగులు వుంటాయి. ఇప్పటివరకు అయిన సినిమా ఫుటేజ్ ను చూపించడంతో, జీ టీవీ సంస్థ మంచి రేటు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
సాక్ష్యం సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. మే రెండో వారంలో డేట్ ప్రకటించారు. ఆ డేట్ కు ముందు వారమే అల్లు అర్జున్ నా పేర సూర్య విడుదలవుతుంది. అది కూడా ఓ వారం వెనక్కు వెళ్లే అవకాశం లేకపోలేదు. అలా అయితే సాక్ష్యం డేట్ డవుట్ లో పడుతుంది. లేదూ అంటే వారం గ్యాప్ లో రెండు సినిమాలు వస్తాయి.