మొత్తానికి ఆర్జీవీ-నాగ్ సినిమా ప్రకటన వచ్చేసింది. మే 25న విడుదల అంటూ ప్రకటించేసారు. దాంతో ఇప్పటికే ప్రకటించకపోయినా, మే 24న విడుదల చేయాలి, తమ సినిమా అనుకున్న సవ్యసాచి యూనిట్ డైలామాలో పడింది.
నిజానికి ఏ రకంగానూ ఆర్జీవీ ఆఫీసర్ మూవీ గురించి నాగ చైతన్య సవ్వసాచి సినిమా యూనిట్ జంకాల్సిన పని లేదు. ఆర్జీవీ పేరు తప్పిస్తే, సవ్యసాచికే ఎడ్జ్ వుంటుంది.
కానీ తండ్రీ కొడుకుల సినిమాలు కావడంతో బాగుండదు కనుక, డేట్ మార్చుకోవడం తప్పడం లేదు. ఆల్టర్ నేటివ్ డేట్ గా జూన్ 14 అనుకున్నారు. కానీ ఇలా అనుకుంటూ మీనం, మేషం లెక్క పెడుతున్నారో లేదో, దిల్ రాజు-రాజ్ తరుణ్ కాంబినేషన్ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేసారు. జూన్ 14న ఆ సినిమా వస్తుంది.
మరి అదే రోజు నాగ చైతన్య సవ్యసాచి కూడా వస్తుందో? లేక వారం ముందుగానో, వెనుకగానో వస్తుందో? ఎందుకంటే దిల్ రాజు సినిమా కావడంతో డిస్ట్రిబ్యూషన్ సమస్యలు వుంటాయనుకోవచ్చు.