మహేష్ కోసం ప్రియాంక భారీ రేటు?

తాజా సమాచారం ప్రకారం, ప్రియాంక చోప్రాకు 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ సెట్ చేశారంట.

మహేష్-రాజమౌళి సినిమాలో హీరోయిన్ గా నటించబోతోంది ప్రియాంక చోప్రా. తాజాగా అగ్రిమెంట్ కూడా పూర్తయింది. షూటింగ్ కోసం విమానం ఎక్కడమే తరువాయి. ఇప్పుడీ సినిమాలో ప్రియాంక రెమ్యూనరేషన్ పై ఆసక్తికర చర్చ సాగుతోంది.

టాలీవుడ్ లో ఇప్పటివరకు ఓ హీరోయిన్ కు ఇచ్చిన అత్యధిక పారితోషికం 18 కోట్ల రూపాయలు. కల్కి సినిమా కోసం దీపికా పదుకోన్ కు ఈ మొత్తం ఇచ్చారనే ప్రచారం ఉంది. ఇప్పుడీ నంబర్ ను దాటి ప్రియాంక చోప్రాకు భారీగా సమర్పించుకున్నారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఆమెకు 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ సెట్ చేశారంట.

ప్రియాంక చోప్రా గ్లోబల్ స్టార్. ఎన్నో అంతర్జాతీయ చిత్రాల్లో నటించింది. మహేష్ తో చేస్తున్న సినిమా కూడా ఇంటర్నేషనల్ ప్రాజెక్టు. కాబట్టి రాజమౌళికి ఆటోమేటిగ్గా ప్రియాంక చోప్రా మొదటి ఆప్షన్ అయింది.

ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో మహేష్ బాబు కంటే, ప్రియాంక చోప్రా అప్పీయరెన్స్ ఎక్కువ ఆకర్షణ తెచ్చిపెడుతుందనేది బహిరంగ రహస్యం. కాబట్టి కోరినంత ఇవ్వాల్సిందే.

అలా భారతీయ హీరోయిన్లలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా నిలిచింది ప్రియాంక చోప్రా. సినిమా రెండు భాగాలుగా మారితే, అప్పుడు లెక్క మళ్లీ మారిపోతుంది. అది మరో రికార్డ్ అవుతుంది.

3 Replies to “మహేష్ కోసం ప్రియాంక భారీ రేటు?”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.