ఎంపీ పదవి వైపే నాగబాబు మొగ్గు!

ముందు అనుకున్నట్టుగా నాగబాబును రాజ్యసభకు పంపాలని భావిస్తున్నారట. అదే జరిగితే.. జనసేన పార్టీకి రాజ్యసభలో ఇది మొట్టమొదటి ప్రాతినిధ్యం అవుతుంది

గతంలో రాజ్యసభ ఎంపీ పదవులు రాష్ట్రానికి దక్కినప్పుడు జనసేన నాయకుడు, పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబును పక్కన పెట్టారు. అప్పుడు దక్కిన మూడు స్థానాల్లో రెండింటిని తెలుగుదేశం తీసుకుని ఒక్క సీటును బిజెపికి ఇచ్చింది. తన సోదరుడి కోసం రిజర్వు చేసుకున్న రాజ్యసభ సీటును పవన్ కల్యాణ్ త్యాగం చేయాల్సి వచ్చింది. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తాం అని చంద్రబాబు అప్పట్లో ఊరడింపుగా ప్రకటించారు.

అయితే ఇప్పుడు రాష్ట్రానికి మరో రాజ్యసభ సీటు దక్కబోతోంది. విజయసాయిరెడ్డి రాజీనామా నేపథ్యంలో త్వరలోనే ఒక రాజ్యసభ ఎంపీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. నాగబాబు మాత్రం.. ఈ రాజ్యసభ సీటును తాను తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. తొలి నుంచి ఢిల్లీ రాజకీయాల మీదనే ఆసక్తి ఉన్న నాగబాబు.. ఇప్పుడొచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది.

విజయసాయిరెడ్డి రాజీనామా చేయడం వల్ల ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయింది. తన రాజీనామా వల్ల ఎన్డీయే కూటమికి మేలు జరుగుతుందని ఆయన కూడా స్వయంగా చెప్పుకున్నారు. అయితే ఆ సీటును ఎవరు దక్కించుకోవాలి. జనసేన- పవన్ కల్యాణ్ కే దక్కుతుందని రాజకీయ వర్గాల్లో అంచనాలు సాగుతున్నాయి.

తన రాజీనామా సంగతిని ట్వీట్ ద్వారా బయటపెట్టిన విజయసాయిరెడ్డి అందులో- చంద్రబాబుతోనైనా రాజకీయంగా విభేదించానని చెప్పుకున్నారు గానీ.. పవన్ కల్యాణ్ తో తనకు చిరకాల స్నేహం ఉందని చాటుకున్నారు. ఆ స్నేహం కోసమే ఈ త్యాగం చేశారా? అనే వాదన కూడా వినిపిస్తోంది.

నాగబాబు విషయానికి వస్తే.. ఆయనకు తొలి నుంచి ఢిల్లీ రాజకీయాల మీదనే ఆసక్తి ఉంది. 2019 లో ఎంపీగా లోక్ సభ ఎన్నికల్లో పోటీచేశారు. 2024లో ఎన్నికల బరిలోకి దిగకుండా తమ్ముడి విజయం కోసం పాటు పడ్డారు. అప్పటినుంచే.. ఆయనకు రాజ్యసభ కట్టబెడతారనే ప్రచారం బాగా జరిగింది. మూడు సీట్లకు ఎన్నికలు జరిగితే.. అవకాశం జనసేనదాకా రాలేదు. అందుకు కాంపన్సేషన్ గా మంత్రి పదవి కట్టబెడతాం అని చంద్రబాబు ప్రకటించారు.

పవన్ కల్యాణ్ బహిరంగంగానే.. తన అన్నయ్యకు రాజ్యసభ ఎంపీ పదవి ఇవ్వాలనుకున్నా అవకాశం దొరకలేదని చెప్పుకున్నారు కూడా. అలాగని ఇప్పటిదాకా మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. తీరా ఇప్పుడు రాజ్యసభకు ఖాళీ ఏర్పడిన తర్వాత మెగా బ్రదర్స్ ఆలోచన మారుతున్నట్టు సమాచారం.

ముందు అనుకున్నట్టుగా నాగబాబును రాజ్యసభకు పంపాలని భావిస్తున్నారట. అదే జరిగితే.. జనసేన పార్టీకి రాజ్యసభలో ఇది మొట్టమొదటి ప్రాతినిధ్యం అవుతుంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి తర్వాత రాజ్యసభకు వెళ్లిన ఘనత కూడా నాగబాబుకు దక్కుతుంది. మరి వీరి మారుతున్న ఆలోచనలు ఏమేరకు కార్యరూపం దాలుస్తాయో వేచిచూడాలి.

6 Replies to “ఎంపీ పదవి వైపే నాగబాబు మొగ్గు!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. పొద్దున్న ఒక మాట..

    .. వైసీపీ ఎంపీ లను బీజేపీ లోకి మాత్రమే చేర్చుకొనే విధం గా అమిత్ షా, చంద్రబాబు మంతనాలు చేస్తున్నారు.. ఆ మంతనాల కోసమే అమిత్ షా చంద్రబాబు ఇంటికి వచ్చి టిపినీలు చేసాడు.. అని రాసావు..

    ..

    సాయంత్రం దోసె తిరగేశావు..

    .. నాగ బాబు కి ఢిల్లీ వెళ్లాలని ఉంది.. అందుకోసమే విజయ సాయి రెడ్డి త్యాగం చేసాడు.. అందుకే పవన్ కళ్యాణ్ తో స్నేహం అంటూ ట్వీట్ చేసాడు అని ఇంకో రోత రాత..

    ..

    నీ జగన్ రెడ్డి తో పాటు నీకు కూడా మైండ్ దొబ్బినట్లుంది.. ఆ లండన్ డాక్టర్ ఎవరో గాని మీ పిచ్చి వాడికి బాగా కలిసొచ్చింది.. మీ పేరు చెప్పుకుని లండన్ కొండల్లో పాలస్ కట్టుకుని ఉంటాడు

  3. జనసేన అంటే కాపుల యొక్క , కాపుల చేత , కాపుల కొరకు అనే కంటే

    జనసేన అంటే మెగా ఫామిలీ యొక్క , కాపుల చేత , మెగా ఫామిలీ కొరకు అనడం కరెక్ట్.

    1. అందుకే.. జగన్ రెడ్డి పార్టీ లో రెడ్లు కూడా తమ పదవులు త్యాగాలు చేసి మరీ జనసేన కి పదవులు బహుమతిగా ఇస్తున్నారు..

  4. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.