స్టార్స్ తో సినిమా తీయగలడా?

ఈ ఒక్క సినిమాతో తన మీదున్న అన్ని విమర్శల్ని తొలిగించుకుంటానని అంటున్నాడు ఆర్జీవీ.

పూర్తిగా మారిపోయానంటూ తనకుతానుగా ప్రకటించుకున్నాడు వర్మ. ఆ వెంటనే ‘సిండికేట్’ అనే సినిమా కూడా ప్రకటించాడు. త్వరలోనే నటీనటుల వివరాలతో వస్తానన్నాడు. ఈ గ్యాప్ లోనే సిండికేట్ లో నటీనటులపై చర్చ సాగుతోంది. కొన్ని పేర్లు కూడా తెరపైకొచ్చాయి.

ఈ సినిమాలో వెంకటేశ్ కీలక పాత్రలో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. ఆయనతో పాటు మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఫహాద్ ఫాజిల్, ఫృధ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉంటారని అంటున్నారు. ఇక వర్మకు బాగా తెలిసిన బిగ్ బి అమితాబ్ కూడా గెస్ట్ రోల్ కంటే కాస్త పెద్ద పాత్రలో కనిపిస్తారనే చర్చ నడుస్తోంది.

హ్యాండిల్ చేయగలడా..?

ఈ పుకార్లన్నింటినీ వర్మ ఖండిస్తున్నాడు. అవన్నీ తప్పుడు ప్రచారాలనీ, అంతా రెడీ అయిన తర్వాత నటీనటుల వివరాలు చెబుతానని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఇక్కడ ప్రశ్న, ‘సిండికేట్’లో ఎవరు నటిస్తారనేది కాదు. సిండికేట్ కోసం ముందుకొచ్చే స్టార్స్ ను రామ్ గోపాల్ వర్మ హ్యాండిల్ చేయగలడా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన చర్చ. ఎందుకంటే, తన కెరీర్ లో స్టార్ హీరోలతో వర్మ చేసిన సినిమాలు చాలా అంటే చాలా తక్కువ. రీసెంట్ గా అతడు తీసిన సినిమాల్లో ఓ మోస్తరు క్రేజ్ ఉన్న నటీనటులు కూడా కనిపించ లేదు.

అసలే ‘ఔట్ డేటెడ్’ అనే విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈమధ్య కాలంలో సరైన హిట్ ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. ఇలాంటి టైమ్ లో వర్మ ప్రాజెక్టులోకి వచ్చేందుకు ఎంతమంది ఆసక్తి చూపిస్తారు.. వచ్చిన తర్వాత వాళ్లలో ఎంతమందిని ఆర్జీవీ హ్యాండిల్ చేయగలడనే చర్చ మొదలైంది.

ఇంతకీ సిండికేంట్ కథేంటి?

సత్య సినిమా చూసిన తర్వాత తన కళ్లు తెరుచుకున్నాయని, జ్ఞానోదయం అయిందని ప్రకటించుకున్న వర్మ.. ఆ మరుసటి రోజే సిండికేట్ సినిమాను ఎనౌన్స్ చేశాడు. గడిచిన 10-15 ఏళ్లుగా ఇండియాలో ఎలాంటి క్రిమినల్ ఆర్గనైజేషన్లు కనిపించలేదని.. మారిన పరిస్థితుల మధ్య దేశాల్ని కలుపుతూ కొత్తగా ఓ క్రైమ్ ఆర్గనైజేషన్ పుట్టుకొస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో సిండికేట్ సినిమా తీస్తానని ప్రకటించాడు.

మనుషులే జంతువుల కంటే అత్యంత క్రూరం అనే ట్యాగ్ లైన్ కూడా ఈ సినిమాకు పెట్టేశాడు. అంతర్జాతీయ నేర సంస్థగా ‘సిండికేట్’ అత్యంత భయంకరంగా ఉండబోతోందని, ఈ ఒక్క సినిమాతో తన మీదున్న అన్ని విమర్శల్ని తొలిగించుకుంటానని అంటున్నాడు ఆర్జీవీ.

5 Replies to “స్టార్స్ తో సినిమా తీయగలడా?”

  1. పాపం.. జగన్ రెడ్డి లాంటి బకరా ఎవరూ దొరకలేదేమో..

    డబ్బు అవసరం కోసం “మారిపోయా” అంటూ వేషం మార్చుకుని వస్తున్నాడు..

    ..

    చెత్త సినిమాలు తీయడం తప్పు కాదు.. కానీ ఆ చెత్త సినిమాల ప్రమోషన్స్ కోసం వ్యక్తిత్వ హననం చేయడం దిగజారుడుతనం..

    ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు..

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.