ఒక సీటు ఖాళీ.. మళ్లీ తెరపైకి చిరంజీవి?

వేగంగా మారిపోతున్న ఈ పరిణామాలన్నీ చిరంజీవి కోసమే అంటోంది సోషల్ మీడియా లోకం.

“నేను రాజకీయాలకు పూర్తిగా దూరం. ఇకపై సినిమాలకే అంకితం. దయచేసి నేను రాజకీయాల్లోకి వస్తున్నానని ఎవ్వరూ మాట్లాడొద్దు.” స్వయంగా చిరంజీవి చేసుకున్న విన్నపం ఇది. ప్రస్తుత రాజకీయాల సరళి చూస్తే తనకు భయమేస్తోందని, తను పాలిటిక్స్ కు సెట్ అవ్వనని ఎన్నో సందర్భాల్లో చెప్పుకున్నారాయన.

ఇలా చిరంజీవి ఎన్నిసార్లు తనకుతానుగా స్వయంగా స్పష్టత ఇచ్చుకున్నప్పటికీ, ఆయన రాజకీయ పునరాగమనంపై పుకార్లు మాత్రం ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా మరోసారి చిరంజీవి పొలిటికల్ రీఎంట్రీపై పుకార్లు మొదలయ్యాయి. దీనికి కారణం విజయసాయి రెడ్డి.

వైసీపీ ఎంపీ విజయసాయి రాజీనామా చేశారు. విజయసాయి రిజైన్ తో ఖాళీ అయిన పోస్టును చిరంజీవితో భర్తీ చేయాలని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు. ఇదీ ప్రస్తుతం చిరంజీవిపై నడుస్తున్న తాజా పుకారు.

రీసెంట్ గా చిరంజీవి, ప్రధానిని కలిశారు. మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో మోదీతో కలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఆయన రాజకీయ రీఎంట్రీకి అక్కడే బీజం పడిందని, విజయసాయి రాజీనామాతో దానికి పునాది ఏర్పడిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. నాగబాబుకు ఇవ్వాల్సిన పదవిని హోల్డ్ లో పెట్టడానికి కూడా ఇదే కారణమని చెబుతున్నారు.

విజయసాయి రాజీనామా లేఖ సమర్పించడం, ఉపరాష్ట్రపతి ఆమోదించడం, రాజ్యసభ సెక్రటరీ జనరల్ బులెటిన్ విడుదల చేయడం చకచకా జరిగిపోయాయి. ఇప్పటివరకు ఏ ఎంపీ రాజీనామా విషయంలో ఇంత ఫాస్ట్ గా పరిణామాలు జరగలేదు. వేగంగా మారిపోతున్న ఈ పరిణామాలన్నీ చిరంజీవి కోసమే అంటోంది సోషల్ మీడియా లోకం.

మరోవైపు పవన్ కల్యాణ్, నాగబాబు పేర్లు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించి, కేంద్రంలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తోందంట. విజయసాయి రాజీనామాకు, పవన్ కల్యాణ్ పొలిటికల్ కెరీర్ కు ముడిపెడుతూ కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి.

ఇక నాగబాబు సంగతి సరేసరి. గతంలో లోక్ సభలో అడుగుపెట్టాలని ప్రయత్నించి విఫలమయ్యారు, ఈసారి పవన్ అండతో రాజ్యసభలో అడుగుపెట్టాలని ఉబలాటపడుతున్నారు.

మొత్తమ్మీద ఉరుములేని పిడుగులా విజయసాయి చేసిన రాజీనామా వెనక అసలు కారణాలేంటనేది పక్కనపెడితే.. ఇలా ఊహించని విధంగా చిరంజీవి పేరు తెరపైకి రావడం మాత్రం విచిత్రం.

6 Replies to “ఒక సీటు ఖాళీ.. మళ్లీ తెరపైకి చిరంజీవి?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. paleru package kalayn has already sold kapu votes to kamma desam party, bogam kammas warned that his gundu photos done by paritala ravi will be released if he doesnt act like a servant to his kamma masters

  3. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  4. బాబూ గ్రేట్ ఆంధ్ర,

    మెగాస్టార్ చిరంజీవికి ఒక పదవి వచ్చినా మీకు టెన్షన్… రాకున్నా మీకు టెన్షనే! చిరంజీవి సినిమా సూపర్ హిట్ ఐనా టెన్షన్… కాకున్నా మీకు టెన్షనే! చిరంజీవి గురించి ఏదో ఒక వార్త రాసి నాలుగు రూపాయలు సంపాదించుకోవాలనే మీ యావ మాకు బాగా తెలుసు!

Comments are closed.