బాలీవుడ్‌ను తెరవెనుక నుంచి నడిపించేది మాఫియా కింగ్‌పిన్‌లు అనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. బాలీవుడ్ వ్యవహారాల్లో మాఫియా జోక్యం ఉందని, పెట్టుబడులు ఉన్నాయని, ఏ హీరోను ప్రమోట్ చేయాలి, ఏ హీరోయిన్‌ను పైకి తేవాలని ఇలా చాలా విషయాల్లో మాఫియా జోక్యం ఉందని గాసిప్స్ ఉన్నాయి. బాలీవుడ్‌లో మనవాళ్లు నెగ్గుకురావడం అంత సులభం కాదని కూడా అంటారు. బాలీవుడ్ వెనుక ఉన్న మాఫియా మీద కథలు కథలుగా గాసిప్స్ ఉన్నాయి.
ఇప్పుడు టాలీవుడ్‌లో బాలీవుడ్ వెనుక ఉన్న మాఫియా గురించి బలమైన గాసిప్ ఒకటి వినిపిస్తోంది. టాలీవుడ్‌లోని మూడు కీలక సంస్థల మీద ఒకేసారి పదుల కొద్దీ ఆదాయపన్ను శాఖ టీమ్‌లు సోదాలు చేయడం వెనుక బాలీవుడ్ మాఫియా ప్రేరణ ఉండి ఉండొచ్చన్నది ఆ గాసిప్. ఇటీవల కాలంలో బాలీవుడ్ సినిమాలు పెద్దగా ఆడడం లేదు. అక్కడి హీరోలు ఫ్లాప్‌లు చూస్తున్నారు. అక్కడి సినిమాలు డిజాస్టర్లు అవుతున్నాయి. బాలీవుడ్‌లో నిర్మాతలు తగ్గిపోతున్నారు. బాలీవుడ్‌లో ఎక్కడ విన్నా దక్షిణాది హవానే.
ఇలాంటి పరిస్థితుల్లో టాలీవుడ్‌కి చెందిన మూడు పెద్ద బ్యానర్ల మీద దాడులు జరిగాయి.
ఒకటి మైత్రీ సంస్థ. ఈ సంస్థ ఇటీవల పుష్ప 2 అనే రెండు వేల కోట్ల సినిమా అందించింది. జాట్ అంటూ గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తోంది. బాలీవుడ్ హీరోలకు పలువురికి అడ్వాన్స్ లు అందించి వుంది.
రెండో సంస్థ దిల్ రాజు ది. ఇప్పటికే బాలీవుడ్ లో ఒకటి రెండు ప్రయత్నాలు చేసారు. ఇటీవల అమీర్ ఖాన్‌ను కలిసి వచ్చారు. వంశీపైడిపల్లి డైరక్షన్ లో సినిమా ప్రయత్నం చేస్తున్నారు.
మూడో సంస్థ అభిషేక్ అగర్వాల్ ది. ఇప్పటికే కాశ్మీర్ ఫైల్స్ అనే సినిమా అందించారు. కార్తికేయ 2 నిర్మాతగా బాలీవుడ్ లో పరిచయం అయ్యారు. గూఢచారి అనే పాన్ ఇండియా సినిమా, కార్తికేయ 3 కి నిర్మాణ భాగస్వామిగా వున్నారు. వాక్సీన్ వార్ అనే సినిమా నిర్మాణంలో వుంది. ఇవన్నీ హిందీ బెల్ట్ లో విడుదలయ్యే సినిమాలే.
ఈ మూడు సంస్థలు ఇప్పుడు ఆదాయపన్ను సోదాలకు టార్గెట్ అయ్యాయి. వన్ ప్లస్ వన్ ఈక్వల్టూ టూ అనే విధంగా టాలీవుడ్ జనం లెక్కలు కడుతున్నారు. టాలీవుడ్ ను బాలీవుడ్ లో ఎంట్రీకి చిన్న అలెర్ట్ ఇది అంటూ ఊహాగానాలు చేస్తున్నారు.
ఆదాయపన్ను శాఖకు ఇవేమీ పట్టకపోవచ్చు. వాటంతట అవే సోదాలు నిర్వహించి వుండొచ్చు. వారి డ్యూటీ వారు చేస్తూ వుండి వుండొచ్చు.
కానీ కాకతాళీయంగా కలిసిన లింక్ లు అన్నీ కలిపి, బాలీవుడ్ వెనుకన వుండే మాఫియా ఈ సొదాల వెనుక కూడా వుండి వుండొచ్చనే గ్యాసిప్ లు మాత్రం బలంగా వినిపించడం ప్రారంభమైంది.
తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ
ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, nalu
️
దావోస్ హోటల్‌లో కిటికీ అడ్డాలు పగిలి పోయాయి -12 డిగ్రీ చలిలో వణుకుతు రాత్రి నిద్రలేదు
పొద్దున్నే సూర్యోదయం కాకుండానే స్టాల్ ఓపెన్ చేసి కూర్చున్నాడు
అంతా చలిలో కూడా స్వట్టర్ లేకుండా రాష్ట్రం కోసం కష్టపడ్డాడు
అదీ చూసి అధికారులు బావురుమని ఏడ్చేశారు