జానీ మాస్టర్ కౌంటర్ కి ఎన్ కౌంటర్!

వ్యక్తిగత వివాదానికి జాతీయ అవార్డుకు సంబంధం ఏంటని కొందరు నన్ను అడుగుతున్నారు. ప్రొఫెషనల్ గా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, గుణం కూడా ముఖ్యం కదా.

లైంగిక వేధింపుల కేసులో పోక్సో చట్టం కింద అరెస్టయి జైలు జీవితం కూడా గడిపాడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. చాలా రోజుల ప్రయత్నం తర్వాత అతడికి బెయిల్ వచ్చింది. బెయిల్ నుంచి బయటకొచ్చిన తర్వాత తొలిసారి అతడు తన భార్యతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చాడు.

ఆ ఇంటర్వ్యూలో తన వెర్షన్ తాను చెప్పుకున్నాడు. భార్యతో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దేవుడున్నాడని చెప్పుకొచ్చాడు. ఇప్పుడా ఇంటర్వ్యూకు కౌంటర్ వచ్చింది. ఎవరి కారణంగా జానీ మాస్టర్ జైలుకెళ్లాడో, ఆ అమ్మాయి తెరపైకొచ్చింది.

అవును.. శ్రేష్టి వర్మ మీడియా ముందుకొచ్చింది. ఎలాంటి ముసుగు లేదు, మాస్క్ లేదు. నేరుగానే కెమెరా ముందుకొచ్చింది. తప్పు చేయనప్పుడు ఎందుకు ముసుగు వేసుకోవాలనేది ఆమె వాదన. అరెస్టయిన టైమ్ లో జానీ మాస్టర్ ముఖానికి మాస్క్, తలపై క్యాప్ పెట్టుకొని కనిపించాడు. బహుశా, దానికి ఇది కౌంటర్ అవ్వొచ్చు.

ఇక జానీ మాస్టర్ చేసిన మరో కీలకమైన అంశంపై కూడా శ్రేష్టి స్పందించింది. జానీ మాస్టర్ పై కక్షతో తను కేసు వేయలేదని, తన ఆత్మాభిమానాన్ని దెబ్బ తీశాడు కాబట్టి బయటకొచ్చానని అంటోంది.

“జానీ మాస్టర్ పై నేను చేసింది కక్షతో కాదు, అది నా అత్మగౌరవానికి సంబంధించిన విషయం. ఓ అమ్మాయిని శారీరకంగా, మానసికంగా వాడుకొని.. ఆ తర్వాత మరో అమ్మాయిని పెట్టుకుంటే ఓకేనా. అప్పుడు నేను చర్యలు తీసుకోకూడదా.. అది రివెంజ్ ఎలా అవుతుంది. అది నా సెల్ఫ్ రెస్పెక్ట్.”

కేసు పెట్టే ముందు తనవద్ద రెండే ఆప్షన్లు ఉన్నాయని, ధైర్యంగా ముందుకెళ్లడం లేదా ఆత్మహత్య చేసుకోవడం మాత్రమే తన దారులని.. వాటిలో నేను మొదటిదాన్ని ఎంచుకున్నానని అంటోంది శ్రేష్టి. పుష్ప-2 సెట్స్ లో జానీ మాస్టర్ తనతో గొడవ పెట్టిన అంశంపై స్పందించడానికి నిరాకరించింది.

“పుష్ప-2 సెట్స్ లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ వచ్చి గొడవ చేశాడు, చేయి చేసుకున్నాడు, కొంతమంది డాన్సర్లు కూడా అక్కడ అది చూశారని చాలామంది అంటున్నారు. దానిపై నాక్కూడా స్పందించాలని ఉంది. కానీ కేసు కోర్టు పరిధిలో ఉంది.. కోర్టులోనే చెబుతా..”

తన వెనక వైసీపీ పార్టీ లేదా అల్లు అర్జున్ ఎవ్వరూ లేరని, తను ఒంటరిగా పోరాటం చేస్తున్నానని తెలిపింది శ్రేష్టి. తన ఆత్మగౌరవం కోసం తాను పోరాటం చేస్తున్నానని, తనకు ఎవ్వరి మద్దతు అవసరం లేదంటోంది. జానీ మాస్టర్ జాతీయ అవార్డుకు అర్హుడు కాదనేది ఆమె ఫీలింగ్.

“వ్యక్తిగత వివాదానికి జాతీయ అవార్డుకు సంబంధం ఏంటని కొందరు నన్ను అడుగుతున్నారు. ప్రొఫెషనల్ గా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ, గుణం కూడా ముఖ్యం కదా. నేషనల్ అవార్డ్స్ కు ఓ చరిత్ర ఉంది. అలాంటి అవార్డ్ ను గుణం లేని ఓ మనిషికి ఎలా ఇస్తారు.”

ఈ సందర్భంగా మరో బాంబ్ పేల్చింది. తనను జానీ మాస్టర్ పరిశ్రమలోకి తీసుకురాలేదని అంటోంది. రియాలిటీ షోలో టాలెంట్ చూపించి, తన స్వశక్తితో పరిశ్రమలోకి వచ్చానని, తనను జానీ మాస్టర్ తీసుకురాలేదని, ఇంకా చెప్పాలంటే ఆయన తనకేం చేయలేదని అంటోంది.

8 Replies to “జానీ మాస్టర్ కౌంటర్ కి ఎన్ కౌంటర్!”

  1. ప్లే బాయ్ వర్క్ :- తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది, తొమ్మిది, సున్నా, ఆరు, నాలుగు, రెండు, ఐదు, ఐదు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  3. eemi emi kaavalo eemake clarity vunnatu ledhu….thanu ae okka visham proove cheyagalgina master ki bail vachedhi kadhu…thanaki nijanga anayaayam jarigi vunte kachitanga eemeki nyaayam jaragali

      1. ఇంతకీ నీకేం కావాల్రా ..కామెంట్ పూర్తిగా అర్థమైందా లేక ఏదో ఒకటి వాగాలి కదా రిప్లై పెట్టావా ..అక్కడ ఆ అమ్మాయిని గాని నిన్ను గానీ నీ వాళ్ళని కానీ ఏమి చేదుగా అనలేదు కదా.. ఆ దిక్కుమాలిన లాంగ్వేజ్ ఎందుకు నీకు?

Comments are closed.