ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారంట!

పోస్టర్ల మీద ఎక్కువ నంబర్లు చూపించడం వల్లే ఇలాంటి రైడ్స్ జరుగుతున్నాయనే అంశంపై స్పందించడానికి నిరాకరించారు దిల్ రాజు.

సాధారణంగా ఆదాయపు పన్నుశాఖ దాడులు జరిగినప్పుడు భారీ మొత్తంలో డబ్బు లేదా బంగారం దొరికినప్పుడు ఐటీ అధికారులు ఆశ్చర్యపోతుంటారు. దిల్ రాజుపై జరిగిన దాడుల్లో కూడా ఇలానే ఐటీ ఆఫీసర్లు ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ దొరికిన డబ్బు చూసి కాదు. అసలు దిల్ రాజు ఇంట్లో ఆఫీస్ లో ఏం దొరకలేదని ఆశ్చర్యపోయారంట.

“మా దగ్గర నుంచి ఎలాంటి డబ్బు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదు. నా దగ్గర 5 లక్షలు, శిరీష్ దగ్గర 4.50 లక్షలు, నా కూతురు ఇంట్లో 6 లక్షలు, ఆఫీస్ లో 2.50 లక్షలు మాత్రమే ఉన్నాయి. బంగారం కూడా రూల్స్ ప్రకారం, వ్యక్తిగతంగా ఎవరి దగ్గర ఎంత ఉండాలో అంతే ఉంది. దిల్ రాజు దగ్గర ఏవేవో దొరుకుతాయని అనుకున్నారు. అలాంటిది మమ్మల్ని చూసి డిపార్ట్ మెంట్ ఆశ్చర్యపోయింది.”

4 రోజుల ఐటీ దాడుల తర్వాత దిల్ రాజు రియాక్షన్ ఇది. ఈ ఐదేళ్లలో దిల్ రాజు కుటుంబం ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదంట.. ఎలాంటి ప్రాపర్టీస్ కొనలేదంట.. ఐటీ డిపార్ట్ మెంట్ ఆ విషయాన్ని నిర్థారించింది. కేవలం తనను మాత్రమే టార్గెట్ చేస్తూ దాడులు జరిగాయనడం కరెక్ట్ కాదంటున్నారు దిల్ రాజు.

“దిల్ రాజును టార్గెట్ చేయలేదు. ఇది ఇండస్ట్రీకి చెందిన విషయం. మైత్రీలో జరిగింది, అభిషేక్ మీద కూడా జరిగింది. ఐటీ రైడ్స్ అనేవి ఓ ప్రాసెస్. కాంగ్రెస్ కు దగ్గరవ్వడం వల్లే రైడ్స్ జరిగాయనేది తప్పు. మా మీద రైడ్ జరిగి 18 ఏళ్లు అయింది. రెగ్యులర్ ప్రొసీజర్ లో భాగంగానే జరిగింది. ఏం జరగలేదు, ఎక్కువ ఊహించుకోవద్దు.”

మరోవైపు నల్లధనంపై కూడా స్పందించారు దిల్ రాజు. ప్రస్తుతం పరిశ్రమలో బ్లాక్ మనీ లేదన్నారాయన. మొత్తం ఆన్ లైన్లోకి మారిందని, 90శాతం ఆన్ లైన్ అని అన్నారు.

“ఇండస్ట్రీలో బ్లాక్ మనీ లేదు. సినిమా ఎలా చూస్తున్నారు, ఆన్ లైన్లో టికెట్ బుక్ చేసుకొని చూస్తున్నారు. 90 శాతం ఆన్ లైన్ టికెటింగ్ ఉంది. ఇక క్యాష్ ఎక్కడ దొరుకుతుంది. ఓవర్సీస్ నుంచి డబ్బులొస్తున్నాయనేది కూడా ఊహ. అంతా ఆన్ లైన్లో జరుగుతోంది.”

పోస్టర్ల మీద ఎక్కువ నంబర్లు చూపించడం వల్లే ఇలాంటి రైడ్స్ జరుగుతున్నాయనే అంశంపై స్పందించడానికి నిరాకరించారు దిల్ రాజు. అది తన ఒక్కడి సమస్య కాదని, దీనిపై ఇండస్ట్రీ మొత్తం కలిసి మాట్లాడాలని అన్నారు.

2 Replies to “ఐటీ అధికారులు ఆశ్చర్యపోయారంట!”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.