అది మహేష్ పాస్ పోర్ట్.. ఈసారి మొత్తం తేడా

మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించి పరోక్షంగా ఓ అప్ డేట్ ఇచ్చాడు రాజమౌళి.

మహేష్ బాబుతో చేస్తున్న సినిమాకు సంబంధించి పరోక్షంగా ఓ అప్ డేట్ ఇచ్చాడు రాజమౌళి. సింహాన్ని బోనులో బంధిస్తున్నట్టు చూపిస్తూ, పాస్ పోర్ట్ చూపించాడు. ఈ చిన్న క్లిప్ ను చాలామంది చాలా రకాలుగా అర్థం చేసుకున్నారు.

మహేష్ తో సినిమాకు అంతా సెట్ అయిందని, విదేశాలకు వెళ్లి షూటింగ్ చేయబోతున్నామనే అర్థం వచ్చేలా ఉందని కొందరు భావించారు. ఇది నిజమే కానీ, ఇంకా చాలా ఉంది.

అసలు మేటర్ ఏంటంటే, కొన్నాళ్ల కిందట ఇదే సింహం బొమ్మను పోస్టు చేసి, దానికి మహేష్ బాబును ట్యాగ్ చేశాడు రాజమౌళి. ఇప్పుడు అదే సింహాన్ని బంధించినట్టు చూపించాడు. అంటే, సింహాన్ని లాక్ చేశామని దాని అర్థం.

అంతేకాదు, క్లిప్ లో రాజమౌళి చూపించిన పాస్ పోర్ట్ కూడా అతడిది కాదు, మహేష్ బాబుది. అలా మహేష్ ను పాస్ పోర్ట్ తో సహా లాక్ చేశామని రాజమౌళి పరోక్షంగా చెప్పినట్టయింది. దీనికి మహేష్ కూడా తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు.

పోకిరిలో “ఒక్కసారి కమిట్ అయితే నామాట నేనే వినను” అనే డైలాగ్ రాసుకొచ్చాడు. అంటే, షూటింగ్ కు రెడీ అయ్యానని, పూర్తిగా సినిమాకే అంకితం అవుతున్నానని అర్థం. అంటే, ఇకపై కుటుంబంతో విహార యాత్రలుండవన్నమాట. ఓన్లీ షూటింగ్.

అటు హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఎట్టకేలకు సెట్స్ పైకి వెళ్తున్నాం అనే అర్థం వచ్చేలా స్పందించింది. మరోవైపు నమ్రత కూడా వీళ్లను ఎంకరేజ్ చేస్తూ సోషల్ మీడియాలో చప్పట్లు కొట్టింది.

అంతా బాగానే ఉంది కానీ ఈ దాగుడుమూతలేంటో అర్థం కావడం లేదు. ఆమధ్య సినిమా లాంఛ్ చేశారు, ఆ విషయం చెప్పలేదు. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నారు. ఈ విషయం కూడా నేరుగా చెప్పడం లేదు. ఈసారి రాజమౌళి వ్యవహారశైలి మొత్తం తేడాగా ఉంది.

9 Replies to “అది మహేష్ పాస్ పోర్ట్.. ఈసారి మొత్తం తేడా”

  1. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

  2. ప్లే బాయ్ వర్క్ :- ఏడు, తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, మూడు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  3. దావోస్ హోటల్‌లో కిటికీ అడ్డాలు పగిలి పోయాయి -12 డిగ్రీ చలిలో వణుకుతు రాత్రి నిద్రలేదు

    పొద్దున్నే సూర్యోదయం కాకుండానే స్టాల్ ఓపెన్ చేసి కూర్చున్నాడు

    అంతా చలిలో కూడా స్వట్టర్ లేకుండా రాష్ట్రం కోసం కష్టపడ్డాడు

    అదీ చూసి అధికారులు బావురుమని ఏడ్చేశారు

  4. దావోస్ లో ఇంద్రం ఉంటున్న లాడ్జి రూమ్ లో అడ్డాలు పగిలి పోయాయి. -12 డిగ్రీ చలి

    ఇంద్రం కి రాత్రి నిద్రలేదు గడ్డకట్టె చలిలో రాష్ట్రం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.

    సూర్యుడు ఉదయించక ముందే స్టాల్ కి వెళ్లి రాష్ట్రం కోసం కష్టపడ్డాడు

    ఇంద్రం స్వట్టర్ కూడా వేసుకోలేదు. చలిలో ఎలా రాష్ట్ర ప్రజల జీవితం 2047 వచ్చేసరికి మనిషికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి సంపాదించి లాగా చెయ్యాలి అని.

    ఇది చూసూ అధికారులు పోలో మని కిందపడి ఏడ్చేశారు.

    మాలోకం దావోస్ నగరంలో కాళీగా ఉన్న వీదుల్లో ట్రాఫిక్ యెక్కువ ఉంది అని కాళీ నడకన స్లోమోషన్ లో నడిస్తు వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడు పాట…

  5. దావోస్ లో ఇంద్రం ఉంటున్న లాడ్జి రూమ్ లో అడ్డాలు పగిలి పోయాయి. -12 డిగ్రీ చలి

    ఇంద్రం కి రాత్రి నిద్రలేదు గడ్డకట్టె చలిలో రాష్ట్రం గురించి ఆలోచిస్తూ కూర్చున్నాడు.

    సూర్యుడు ఉదయించక ముందే స్టాల్ కి వెళ్లి రాష్ట్రం కోసం కష్టపడ్డాడు

    ఇంద్రం స్వట్టర్ కూడా వేసుకోలేదు. చలిలో ఎలా రాష్ట్ర ప్రజల జీవితం 2047 వచ్చేసరికి మనిషికి 1 కోటి రూపాయలు సంవత్సరానికి సంపాదించి లాగా చెయ్యాలి అని.

    ఇది చూసూ అధికారులు పోలో మని కిందపడి ఏడ్చేశారు.

    మాలోకం దావోస్ నగరంలో కాళీగా ఉన్న వీదుల్లో ట్రాఫిక్ యెక్కువ ఉంది అని కాళీ నడకన స్లోమోషన్ లో నడిస్తు వస్తున్నాడు. బ్యాక్ గ్రౌండ్ లో శ్రీమంతుడు పాట…

  6. ఏంటి.. పాస్పోర్ట్ పైన అట్ట చూసే నీకు అది మహేష్ బాబు పాస్పోర్ట్ అని తెలిసిపోయిందా..

    నీ అతి కుత్తలో నా.. వద్దులే..

Comments are closed.