కాస్సేపట్లో ‘బ్యాన్’ టీజర్ ప్రకటన

మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో తయారవుతున్న భరత్ అనే నేను ప్రచార కార్యక్రమాలకు తెరలేపింది. మరో యాభై రోజుల్లో సినిమా విడుదల కాబోతోంది. ఏప్రియల్ 20న విడదులయ్యే ఈ సినిమా టీజర్ ను…

మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో తయారవుతున్న భరత్ అనే నేను ప్రచార కార్యక్రమాలకు తెరలేపింది. మరో యాభై రోజుల్లో సినిమా విడుదల కాబోతోంది. ఏప్రియల్ 20న విడదులయ్యే ఈ సినిమా టీజర్ ను ఫస్ట్ వీక్ లో విడుదల చేయబోతున్నారు. అయిదు లేదా ఆరు తేదీల్లో భరత్ అనే నేను టీజర్ బయటకు వదులుతారు. 

ఆ విషయాన్ని ఈరోజు సాయంత్రం ఆరుగంటలకు ప్రకటిస్తారు. అంటే టీజర్ ఎప్పుడు ఎన్నిగంటలకు వదుల్తారో ఈరోజు సాయంత్రం ప్రకటిస్తారన్నమాట.

ఇలా ప్రకటిస్తామంటూ ముందుగా ఓ చిన్న నోటిఫికేషన్ లాంటిది ట్విట్టర్ లో వదిలారు. ఇదంతా చూస్తుంటే కాస్త ప్లాన్డ్ గానే వున్నట్లుంది వ్యవహారం. టీజర్ ఎప్పుడొస్తుందో చెప్పడానికి ఓ ప్రకటన, అది చెప్పడానికి మరో ప్రకటన.

బ్యాన్ సినిమా ఆడియో బాగా వచ్చిందని వార్తలు వుస్తూన్నాయి. టీజర్ తరువాత ఒక్కోసింగిల్ బయటకు వస్తాయి. ఆ తరువాత ఆడియో లేదా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏఫ్రియల్ ఫస్ట్ వీక్ లో వుండే అవకాశం వుంది.