ఎక్స్ క్లూజివ్-చిత్రలహరి బార్

చిత్రలహరి అనే టైటిల్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆసక్తిగా వుంటోది జనాలకు ఆ ప్రాజెక్టుపై. కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని చేస్తాడు అనగానే మరింత ఆసక్తి కలిగింది. అయితే తను గతంలో చేసిన…

చిత్రలహరి అనే టైటిల్ బయటకు వచ్చిన దగ్గర నుంచి ఆసక్తిగా వుంటోది జనాలకు ఆ ప్రాజెక్టుపై. కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని చేస్తాడు అనగానే మరింత ఆసక్తి కలిగింది. అయితే తను గతంలో చేసిన సినిమా జోనర్ కు దగ్గరగా వుండడంతో నాని వదిలేసాడని వార్తలు వినవచ్చాయి.

దాంతో ఇప్పుడు ఈ సినిమా ప్రాజెక్టును సాయి ధరమ్ తేజకు షిప్ట్ చేసే ప్రయత్నంలో వున్నారని బోగట్టా. అయితే ఈ ప్రాజెక్టు అలాగే సెట్ అవుతుందా? లేక శర్వానంద్ వైపు మళ్లుతుందా? అన్న అనుమానాలు కూడా వున్నాయి. ఇదిలా వుంటే చిత్రలహరి టైటిల్ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.

సినిమాలో చిత్రలహరి అన్నది ఓ బార్ గా కనిపిస్తుంది. ఆ బార్ లోనే సినిమా అధికభాగం జరుగుతుంది. హీరో కావచ్చు, వివిద పాత్రలు కావచ్చు బార్ తో ముడిపడి వుంటాయని తెలుస్తోంది.

అందువల్లే సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సాయిధరమ్ తేజనే హీరో అన్నది ఫిక్స్ అయితే ఈ సినిమా మరో రెండు నెలల్లో సెట్ మీదకు వెళ్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో వుంటుందీ సినిమా.