ఆ హీరోకు అమ్మకానుక

హీరోలకు నిర్మాతలు, దర్శకులు కానుకలు ఇవ్వడం, లేదా అట్నుంచి ఇటు కానుకలు ఇవ్వడం కామన్ నే. అలాగే హీరోలు అమ్మా, నాన్నలకు కానుక ఇవ్వడం కూడా సహజమే. అయితే ఇది కాస్త వైరైటీ. Advertisement…

హీరోలకు నిర్మాతలు, దర్శకులు కానుకలు ఇవ్వడం, లేదా అట్నుంచి ఇటు కానుకలు ఇవ్వడం కామన్ నే. అలాగే హీరోలు అమ్మా, నాన్నలకు కానుక ఇవ్వడం కూడా సహజమే. అయితే ఇది కాస్త వైరైటీ.

హీరో కు హిట్ ఇచ్చిన నిర్మాత ఆమెనే. హీరో తల్లి ఆమెనే. అందుకే రెండు విధాలా కలిసి వచ్చేలా కోటీ పాతిక లక్షల విలువైన పోర్చ్ స్పోర్ట్స్ కార్ ను బహుమతిగా అందించారు.

హీరో నాగశౌర్యకు మాంచి కమర్షియల్ హిట్ సినిమాను ఇచ్చారు నిర్మాత ఉష మాల్పూరి. ఆమె ఎవరో కాదు శౌర్య తల్లే. కేవలం లెక్కల కోసం, పేరు కోసం నిర్మాతగా ఆమె పేరు వేయలేదు.

టోటల్ ప్రాజెక్టును డే వన్ నుంచి ఇప్పటి వరకు ఆమెనే చూసుకున్నారన్నది ఇండస్ట్రీ జనాలు అందరికీ తెలుసు. ఛలో సినిమాకు ముఫై రోజులకు 13కోట్ల మేరకు షేర్ వచ్చింది. చాలా ఏరియాలు స్వంతంగా వుంచుకోవడంతో, మంచి లాభాలు వచ్చాయి.

అందుకే సినిమా విడుదలై నెల పూర్తయిన సందర్భంగా కోటి పాతిక లక్షల విలువైన పోర్చ్ స్పోర్ట్స్ కారును నాగశౌర్యకు గిఫ్ట్ గా అందించారు నిర్మాత కమ్ మదర్ మాల్పూరి ఉష.