పెదకాపు ఫ్లాప్ పై అనసూయ సంచలన వ్యాఖ్యలు

రంగస్థలం తర్వాత అనసూయ ఆ స్థాయిలో ఆశలు పెట్టుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది పెదకాపు-1 మాత్రమే. ఇన్నాళ్లూ తనను రంగమ్మత్త అని పిలిచారని, కానీ పెదకాపు-1 రిలీజ్ అయిన తర్వాత ఆ పాత్ర…

రంగస్థలం తర్వాత అనసూయ ఆ స్థాయిలో ఆశలు పెట్టుకున్న సినిమా ఏదైనా ఉందంటే అది పెదకాపు-1 మాత్రమే. ఇన్నాళ్లూ తనను రంగమ్మత్త అని పిలిచారని, కానీ పెదకాపు-1 రిలీజ్ అయిన తర్వాత ఆ పాత్ర పేరుతో పిలుస్తారని చెప్పుకొచ్చింది. కట్ చేస్తే, ఆ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది.

దీనిపై తాజాగా స్పందించింది అనసూయ. ఆ సినిమాలో తన అవగాహనకు అందని అంశాలు కొన్ని ఉన్నాయని, కానీ దర్శకుడితో ఎప్పుడూ డిస్కస్ చేయలేదని అంటోంది.

“పెదకాపు-1 సినిమా పూర్తిగా శ్రీకాంత్ అడ్డాల సినిమా. కొన్ని మన అవగాహనకు అందవు. ఈ సినిమాలో కూడా నాకు అలాంటి మూమెంట్స్ ఉన్నాయి. కానీ దర్శకుడి ముందు నేనెంత. బహుశా, ఆయన విజన్ నాకు అర్థంకాలేదేమో. నాలాగే చాలామంది ఆడియన్స్ కు కూడా ఆ సినిమా అర్థంకాలేదనుకుంటా. అయితే ఆ సినిమాను ఇష్టపడే వాళ్లు చాలామంది ఉన్నారు. శ్రీకాంత్ అడ్డాల తను అనుకున్నది సాధించారనే నేను అనుకుంటున్నాను.”

పెదకాపు-1లో తనకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు కట్ చేశారనే వాదనను అంగీకరించింది అనసూయ. దానికి సంబంధించి తనకు, దర్శకుడికి మధ్య ఎలాంటి మనస్పర్థలు రాలేదని అంటోంది.

“నా పాత్రకు సంబంధించి కొన్ని సీన్లు కట్ అయ్యాయని, కథతో కనెక్షన్ మిస్సయిందని నాకు అనిపించింది. కానీ అది నా తప్పు కాదు కదా. పైగా అలా కట్ చేయడం తప్పు కూడా కాదు. నాకు, శ్రీకాంత్ అడ్డాల కు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవు. పైగా ఇప్పుడు అంతా చూసింది పార్ట్-1 మాత్రమే. పార్ట్-2 కూడా వస్తోంది. ఇందులో అర్థంకాని విషయాల్ని, పార్ట్-2లో అర్థమయ్యేలా చెబుతారేమో.”

పెదకాపు-2 కూడా వచ్చే అవకాశం ఉందని, 2 సినిమాలు కలిపి చూస్తే.. పార్ట్-1లో అర్థంకాని విషయాలు అప్పుడు అర్థమౌతాయని అంటోంది అనసూయ.