భువనేశ్వరి ఉత్తరాంధ్రా చూపు

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లా నుంచి ఇపుడు ఉత్తరాంధ్రా వైపు వస్తున్నారు. నిజం గెలవాలి అన్న పేరుతో ఆమె చేస్తున్న పర్యటన నవంబర్ 1 నుంచి ఉత్తారాంధ్రాలో మొదలెడుతున్నారు.…

టీడీపీ అధినేత నారా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చిత్తూరు జిల్లా నుంచి ఇపుడు ఉత్తరాంధ్రా వైపు వస్తున్నారు. నిజం గెలవాలి అన్న పేరుతో ఆమె చేస్తున్న పర్యటన నవంబర్ 1 నుంచి ఉత్తారాంధ్రాలో మొదలెడుతున్నారు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఈ పర్యటన సాగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. బాబు అరెస్ట్ అక్రమం అని పేర్కొంటూ భువనేశ్వరి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. నారావారి పల్లెలో మొదలెట్టి శ్రీ కాళహస్తిలో తొలి విడత ముగిచిన ఆమె మలి విడతకు ఉత్తరాంధ్రాను ఎంచుకున్నారు.

లోకేష్ పాదయాత్ర సవ్యంగా సాగితే ఉత్తరాంధ్రాలో ఈపాటికి పాదం కదిపేవారు. ఆయన పాదయాత్ర  గోదావరి జిల్లాలలోనే నిలిచిపోవడంతో పాటు చంద్రబాబు జైలులో ఉండడంతో ఆయన ఉత్తరాంధ్రా పర్యటనలు లేకపోవడంతో ఆ బాధ్యతలను భువనేశ్వరి తీసుకున్నారని అంటున్నారు.

పనిలో పనిగా ఆమె విజయనగరం దగ్గర రైలు యాక్సిడెంట్ లో మృతి చెందిన కుటుంబాలను పరామర్శిస్తారు అని అంటున్నారు. భువనేశ్వరికి పార్టీకి ఇపుడు కేంద్ర బిందువు అయ్యారని పార్టీ నేతలు అంటున్నారు. ఉత్తరాంధ్రాలో  టీడీపీ నేతలు భువనేశ్వరి పర్యటనను ఎలా సక్సెస్ చేస్తారో అన్న ఉత్కంఠ ఉంది.