వర్మ సినిమా ఓ గాలిబుడగ?

  Advertisement రామ్ గోపాల్ వర్మ-నాగార్జున సినిమా మీద ట్రేడ్ సర్కిళ్లలో చాలా వార్తలు వున్నాయి. ఆర్జీవీకి బాలీవుడ్ లో వున్న పరిచయాలు, హిందీ సినిమా రంగంలో వున్న ఇంతో అంతో క్రేజ్ అన్నీకలిసి…

 

రామ్ గోపాల్ వర్మ-నాగార్జున సినిమా మీద ట్రేడ్ సర్కిళ్లలో చాలా వార్తలు వున్నాయి. ఆర్జీవీకి బాలీవుడ్ లో వున్న పరిచయాలు, హిందీ సినిమా రంగంలో వున్న ఇంతో అంతో క్రేజ్ అన్నీకలిసి ఆ సినిమాకు మంచి మార్కెట్ తెచ్చి పెడతాయని, ఆర్జీవీ పంట పండుతుందని అంచనా వేసారు. ఆర్జీవీ కూడా అలాగే అనుకున్నారట.

తెలుగు వెర్షన్ ను 15కోట్లకు పైగా అమ్మేయవచ్చు, హిందీ డబ్బింగ్ రైట్స్ బాగా వస్తాయి, వాటితోనే సినిమా ఫినిష్ అయిపోతుంది. తెలుగు శాటిలైట్, ఓవర్ సీస్ వంటివి లాభాలుగా వుండిపోతాయి అని అనుకున్నట్లు ఫీలర్లు కమ్ వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడిప్పుడే మబ్బులు వీడిపోతున్నట్లు బోగట్టా. వర్మ-నాగ్ కాంబినేషన్ హిందీ డబ్బింగ్ రైట్స్ జస్ట్ అయిదు కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇటీవల తెలుగు సినిమాల హిందీ రైట్స్ కు మంచి రేట్లు పలుకుతున్నాయి. కుర్ర హీరోల సినిమాలకు కూడా పది హేను కోట్లు, పాతిక కోట్లు వస్తున్నాయి. అలాంటిది నాగ్-వర్మ సినిమాకు అయిదు కోట్లు మాత్రమే పలికినట్లు తెలుస్తోంది.

ఇదిలా వుంటే ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులకు ఎవ్వరూ ఇంట్రస్ట్ చూపించడం లేదని వినికిడి. ఇప్పటి వరకు ఏ విధమైన ఎంక్వయిరీ రాలేదని తెలుస్తోంది. మరి హిందీ, ఓవర్ సీస్ పరిస్థితి ఇలా వుంటే? తెలుగు రాష్ట్రాల హక్కుల సంగతేమిటో? ఎలా లేదన్నా సినిమాకు 15కోట్లు ఖర్చవుతుంది. ఆ మేరకు రాకపోతే ఆర్జీవీ కంపెనీకి కన్నం పడుతుంది.