1న బన్నీ ఫ్యాన్స్ కు ‘ఇంపాక్ట్’

నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో ఓ టీజర్ లాంటిది విడుదల చేసారు కొన్నాళ్ల కిందట. దాంతో ఆ సినిమాకు మాంచి బజ్ వచ్చింది. ఆ తరువాత సింగిల్స్ రెండు వదిలారు కానీ…

నా పేరు సూర్య ఫస్ట్ ఇంపాక్ట్ పేరుతో ఓ టీజర్ లాంటిది విడుదల చేసారు కొన్నాళ్ల కిందట. దాంతో ఆ సినిమాకు మాంచి బజ్ వచ్చింది. ఆ తరువాత సింగిల్స్ రెండు వదిలారు కానీ పెద్ద ఇంపాక్ట్ రాలేదు. విజవల్స్ యాడ్ అయితే వేరేగా వుంటుందేమో ఆ పాటల సంగతి. ఇదిలా వుంటే మళ్లీ పోస్టర్ ఇంపాక్ట్ పేరుతో మరోటి విడుదల చేయబోతున్నారు.

హోలీ పండుగ సందర్భంగా 1వ తేదీన ఈ పోస్టర్ ఇంపాక్ట్ ను ఆన్ లైన్ లోకి విడుదల చేస్తారు. ఇది ఎలా వుంటుంది? ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుందన్నది ప్రస్తుతానికి సస్సెన్స్. నా పేరు సూర్య విడుదలకు ఇంకా రెండు నెలల సమయం వుంది. అందుకే ఇప్పటి నుంచీ అన్నీ వదిలేయకుండా, అలా ఒకటి ఒకటి వదులుతూ ఆసక్తి కలిగించే ప్రచార కార్యక్రమం చేపడుతున్నారు.

రచయిత వక్కంతం వంశీ తొలిసారి దర్శకుడిగా అందిస్తున్న నా పేరు సూర్య సినిమాను లగడపాటి శ్రీధర్ తో కలిసి నాగబాబు, బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. ఈ సినిమా ఏప్రియల్ 26న విడుదల కావాల్సిందే. కానీ ఇండస్ట్రీ హీరోల అడ్జస్ట్ మెంట్ ల్లో భాగంగా మే 4కు వాయిదా పడింది.