ఇష్టం లేని సినిమా.. దేవరకొండ తిప్పలు

ఓ సినిమా హిట్ అయితే ఎంత క్రేజ్ వస్తుందో, మరికొన్ని కోణాల్లో అంతే ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండకు అలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఛాన్స్ వస్తే చాలనుకునే…

ఓ సినిమా హిట్ అయితే ఎంత క్రేజ్ వస్తుందో, మరికొన్ని కోణాల్లో అంతే ఇబ్బందులు కూడా ఎదురవుతుంటాయి. స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న విజయ్ దేవరకొండకు అలాంటి ఇబ్బందులే ఎదురవుతున్నాయి. ఛాన్స్ వస్తే చాలనుకునే రోజుల్లో ఈ హీరో చేసిన ఓ మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతోంది. ఇది ఫ్లాప్ అయితే అతడి కెరీర్ కు ఇబ్బందే.

ఏ మంత్రం వేశావే.. విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ ఇది. ఈ హీరో ఎంచుకొని చేసిన సినిమా కాదిది. పెళ్లిచూపులు టైమ్ లో ఒప్పుకున్న సినిమా. అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ సినిమాను ఇప్పుడు హుటాహుటిన తెరపైకి తీసుకొచ్చారు. దీనికి విజయ్ ప్రచారం చేస్తాడా చేయడా అనేది కూడా అనుమానమే.

నిజానికి దీంతో పాటు మరో రెండు సినిమాలు కూడా ఉన్నాయి. గీతగోవిందం, టాక్సీవాలా అనే సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ రెండూ అల్లు అరవింద్ కు చెందిన సినిమాలు. పైగా రెండింటిపై విజయ్ కు కాస్త గురి ఉంది. అర్జున్ రెడ్డి లాంటి గ్రాండ్ హిట్ తర్వాత ఈ రెండింటిలో ఒకటి విడుదలైతే బాగుండేదని ఇతగాడి ఫీలింగ్.

కానీ ఇంతలోనే 'ఏ మంత్రం వేశావే' అనే సినిమాను మార్చి 9న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ మూడు సినిమాల్లో ఏది ముందొస్తుందో.. అర్జున్ రెడ్డి సక్సెస్ ను ఎంత క్యాష్ చేసుకుంటుందో చూడాలి.