టైటిల్ ని ఆపేసిన శ్రీదేవి

అలనాటి మేటి హీరోయిన్ శ్రీదేవి హఠాన్మరణం, నాగ్-ఆర్జీవీ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ను ఆపేసింది. వాస్తవానికి ఈ మధ్యాహ్మం రెండు గంటలకు నాగ్-ఆర్జీవీ సినిమా టైటిల్ ప్రకటన వుండాలి. Advertisement కానీ ఈ…

అలనాటి మేటి హీరోయిన్ శ్రీదేవి హఠాన్మరణం, నాగ్-ఆర్జీవీ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ ను ఆపేసింది. వాస్తవానికి ఈ మధ్యాహ్మం రెండు గంటలకు నాగ్-ఆర్జీవీ సినిమా టైటిల్ ప్రకటన వుండాలి.

కానీ ఈ తెల్లవారుఝామున శ్రీదేవి మరణించడంతో అందరికన్నా ఎక్కువ బాధకు గురయింది ఆర్జీవీనే. ఎంత బాధ అంటే రోజంతా ట్వీట్ లు చేస్తూనే వున్నారు. దాదాపు రెండు పదుల ట్వీట్ లు. అనేక పాత ఫొటోలు. ఓ పేద్ద వ్యాసం ఆర్జీవీ నుంచి వచ్చాయి.

వీటన్నింటి మధ్య నాగ్ తో సినిమా టైటిల్ ఊసే లేదు. కనీసం ఈ కారణంగా ఆపేసాం అనీ లేదు. బహుశా రేపు ట్విట్టర్ లో ప్రకటిస్తారేమో? గన్, డిపార్ట్ మెంట్, ఇలా రకరకాల టైటిళ్లు వినిపిస్తున్నాయి. టైటిల్ మీద కన్నా అభిమానులకు రిలీజ్ డేట్ మీద ఆసక్తిగా వుంది.

ఎందుకంటే ప్రీ, పోస్ట్ సమ్మర్ సినిమాల డేట్లు అన్నీ దాదాపు వచ్చేసాయి. నాగ్ సినిమా ఎప్పుడన్నదే ఇంకా తెలియలేదు. మే 24న నాగ చైతన్య సవ్యసాచి అని తాత్కాలికంగా వినిపిస్తోంది. దాని ముందుగానో, వెనకగానో నాగ్ సినిమా డేట్ వుండే అవకాశం వుంటుందేమో?