వరుణ్ తేజ్ దర్శకుడితో అక్కినేని హీరో

మొన్నటికి మొన్న తను ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదని, కొత్త కథలు మాత్రం వింటున్నానని, తన అప్ కమింగ్ మూవీస్ పై వస్తున్న వార్తల్లో నిజంలేదని నాగచైతన్య ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి…

మొన్నటికి మొన్న తను ఎలాంటి కొత్త సినిమాలకు కమిట్ అవ్వలేదని, కొత్త కథలు మాత్రం వింటున్నానని, తన అప్ కమింగ్ మూవీస్ పై వస్తున్న వార్తల్లో నిజంలేదని నాగచైతన్య ట్వీట్ చేశాడు. ఇప్పుడు ఇలాంటి ట్వీటే అఖిల్ కూడా చేయాల్సి వస్తుందేమో.

ఈ హీరో అప్ కమింగ్ మూవీపై రోజుకో రూమర్ వైరల్ అవుతోంది. మొన్నటివరకు అఖిల్ లిస్ట్ లో ఇద్దరు దర్శకులున్నారని, వాళ్లలో సత్య పినిశెట్టి చెప్పిన కథకు అక్కినేని హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ వార్తలొచ్చాయి. సుకుమార్, కొరటాల శివ పేర్లు కూడా వినిపించాయి. ఇప్పుడీ లిస్ట్ లోకి తొలిప్రేమ దర్శకుడు వెంకీ అట్లూరి కూడా చేరాడు.

వరుణ్ తేజ్ ను హీరోగా పెట్టి తొలిప్రేమ సినిమా తీసి గ్రాండ్ సక్సెస్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా చేయబోతున్నాడట. అఖిల్-వెంకీ మధ్య కథా చర్చలు జరిగినట్టు వార్తలొస్తున్నాయి. కానీ అఫీషియల్ గా ఇప్పటివరకు మేటర్ బయటకు రాలేదు. ప్రాజెక్టు సెట్ అయితే మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా ఉంటుంది.

అయితే తొలిప్రేమ సినిమాను నిర్మించిన బీవీఎస్ఎన్ ప్రసాద్ బ్యానర్ లోనే వెంకీ అట్లూరి ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయాల్సి ఉంది. అఖిల్ తో సినిమా ఓకే అయితే ముందు మైత్రీ మూవీస్ బ్యానర్ పైనే సినిమా ఉంటుంది.