ప్రాజెక్టులు ప్లాన్ చేయడంలో, ప్రాజెక్టులు పట్టడంలో దిల్ రాజు భలే చురుగ్గా వ్యవహరిస్తారు. పైగా నిర్మాతగా మంచి పేరు, డిస్ట్రిబ్యూషన్ నెట్ వర్క్, థియేటర్లు చేతిలో వుండడంతో సినిమాలు ఆయనతో చేయడానికైనా, ఆయనకు ఇవ్వడానికైనా పెద్దగా సంకోచించరు.
ఈ లైన్లోనే ఆయనకు మరో ప్రాజెక్టు భలే మంచి చౌకబేరము అన్నట్లు దొరికేసింది. నాని డబుల్ రోల్ తో చేస్తున్న కృష్ణార్జున యుద్దం ప్రాజెక్ట్ ను దిల్ రాజు హోల్ సేల్ గా కొనేసిన సంగతి ఆల్రెడీ తెలిసిందే.
కృష్ణార్జున యుద్దం ఉభయ తెలుగు రాష్ట్రాలు, శాటిలైట్, డిజిటల్ కలిపి దిల్ రాజు 21.75 కోట్లకు తీసుకున్నారట. ఓవర్ సీస్ మాత్రం నిర్మాత దే. శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ అన్నీ కలిసి కానీ ఆరేడు కోట్లే వస్తుందనుకున్నా, 15 నుంచి 16కోట్ల రేంజ్ కు ఉభయ తెలుగు రాష్ట్రాల హక్కులు వచ్చేసాయన్నమాట.
ఇటీవల తొలిప్రేమ హక్కులు ఉభయ తెలుగు రాష్ట్రాలకు దిల్ రాజు 18కోట్లకు (రెండు కోట్లు రిటర్న్ గ్యారంటీ)కి కొన్నాడు. అది వరుణ్ తేజ్ సినిమా. నాని సినిమా అంటే వరుణ్ తేజ్ సినిమా కన్నా కచ్చితంగా ఎక్కువ అడ్వాంటేజ్ వుంటుంది. పైగా దాని కన్నా తక్కువకు వచ్చింది.
అంటే దిల్ రాజు మంచి రేటుకే సినిమాను పట్టేసాడన్నమాట. నిర్మాతకు కూడా నష్టం లేదు. మేర్లపాక గాంధీ అందిస్తున్న ఈ సినిమాకు నిర్మాతలు కొత్తవారు. తొలిసినిమాను వాళ్లు 18కోట్ల రేంజ్ లో ఫినిష్ చేసారని తెలుస్తోంది. ప్రమోషన్ కు మరో కోటి రెండు కోట్లు ఖర్చు చేసినా, ఓవర్ సీస్ అమౌంట్, ప్లస్ దిల్ రాజు డీల్ లో రెండు కోట్లు. వెరసి మంచి లాభమే.