వారానికో సినిమా వర్కవుట్‌ అవుతుందా?

వేసవిలో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ యమ బిజీగా వుండనుంది. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలతో పాటుగా మరికొన్ని మీడియం రేంజ్‌ సినిమాలు కూడా రిలీజ్‌కి సిద్ధమయ్యాయి. Advertisement ముందుగా రామ్‌ చరణ్‌ 'రంగస్థలం' మార్చి 30న…

వేసవిలో టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ యమ బిజీగా వుండనుంది. ఏకంగా నాలుగు పెద్ద సినిమాలతో పాటుగా మరికొన్ని మీడియం రేంజ్‌ సినిమాలు కూడా రిలీజ్‌కి సిద్ధమయ్యాయి.

ముందుగా రామ్‌ చరణ్‌ 'రంగస్థలం' మార్చి 30న వస్తుంది. ఆ తర్వాత వారానికో సినిమా చొప్పున మే 4 వరకు వరుసగా సినిమాలున్నాయి. నితిన్‌ నటిస్తున్న 'ఛల్‌ మోహన్‌ రంగ' ఏప్రిల్‌ 6న, నాని చేస్తున్న 'కృష్ణార్జున యుద్ధం' ఏప్రిల్‌ 13న, మహేష్‌ 'భరత్‌ అనే నేను' 20న, రజనీకాంత్‌ 'కాలా' 27న వస్తాయి.

మే 4న అల్లు అర్జున్‌ నటిస్తున్న 'నా పేరు సూర్య' రిలీజ్‌ కానుంది.  ఇవి ఇంతవరకు అనౌన్స్‌ అయిన సినిమాలు కాగా, ఇంకా ప్లానింగ్‌లో వున్నవి చాలానే వున్నాయి. ఒక్కో డేట్‌కి మల్టిపుల్‌ రిలీజ్‌లు కూడా ఖాయమనిపిస్తోంది.

'రంగస్థలం' అనౌన్స్‌ చేసిన డేట్‌కే 'మహానటి' కూడా అనౌన్స్‌ అయింది. అదే వారంలో రావాలని కల్యాణ్‌రామ్‌ 'ఎంఎల్‌ఏ' చిత్రం సిద్ధపడుతోంది. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సినిమాలు వస్తూ వుంటే దేనికైనా లాంగ్‌ రన్‌ వస్తుందా అనేది అనుమానంగా కనిపిస్తోంది.

పెద్ద సినిమాలకే కాక మీడియం రేంజ్‌ సినిమాలకి కూడా ఇది సమస్యే అవుతుంది. వారంలో ఎంత రాబట్టుకుంటే అంత అన్నట్టుంది వ్యవహారం. కనీసం రెండు వారాలైనా సమయం లేకపోతే వంద కోట్ల వసూళ్లు రాబట్టడం జరిగే పనేనా అనేది చూడాలి.