వర్మ జీఎస్టీలో కొత్త కొత్త ట్వీస్ట్ లు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు వర్మకు టీజర్ ను చూపారు. ఇక మీదట ఆడియోతో పాటుగా సినిమాను కూడా చూపెట్టబోతున్నారు. టీజర్ కే వర్మకు చుక్కలు కనిపించాయి.. అయితే ఆడియోతో ఏమి కాబోతుందో తెలియని స్థితి.. సినిమాను మొత్తం చూపించినట్టుయితే వర్మ ఏమి చేస్తాడో చూడాల్సివుంది. మొదటిసారి విచారణకు వచ్చిన వర్మ పొంతనలేని సమాధానాలు చెప్పి తప్పించుకుని పొయాడు. కానీ రెండోసారి విచారణకు వస్తున్న వర్మకు పోలీసులు ఆధారాలతో సహా చూపెట్టబోతున్నారు.
ఇప్పటికే వర్మ ల్యాబ్ ట్యాబ్ ను సీజ్ చేసిన ఆధికారులు.. అందులో వున్న డాటా ఆధారంగా విచారణ చేయబోతున్నారు. తాను ఈ సినిమాకు డైరెక్టర్ గా పనిచేయలేదని తప్పించుకున్న వర్మ.. అందుకు సంబంధించిన ఆధారాలను సీసీఎస్ పోలీసులు సంపాందించబోతున్నారు. ప్రధానంగా స్కైప్ కు సంబంధించిన వీడియో కాలింగ్ డాటాను కూడా అధికారులు తెప్పించబోతున్నారు. దీనికి తోడుగా వాట్సప్ వీడియోతో పాటుగా ఆడియో కాలింగ్ డాటాను కూడా తెప్పిస్తున్నారు.
ఇవన్నింటితో పాటుగా టీవీషొల్లో వర్మ చేసిన కామోంట్లుకు సంబంధించిన పుటేజీలను కూడా సీసీఎస్ అధికారులు తెప్పిస్తున్నారు. వీటిలో వర్మ చేసిన కామెంట్లు పైన కూడా విచారణ చేయబోతున్నారు. ఇకపొతే అన్నింటికి తప్పించుకునే ధోరణిలో మాట్లాడిన వర్మ ఇప్పడు ఏమి చేయబోతున్నారో చూడాల్సి వుంది. రాంగోపాల్ వర్మ మరోసారి విచారణకు హాజరుకానున్నారు. సామాజిక కార్యకర్త దేవీ ఇచ్చిన ఫిర్యాదుతో వర్మకు సైబర్ క్రైం పోలీసులు రెండుసార్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు పంపారు.
ఇదిలా వుంటే ఈ వివాదంలో మొదటి నుంచి కూడా స్టోరీ మొత్తం నాది అంటున్న జై కూమర్ ను కూడా సీసీఎస్ పోలీసులు విచారించారు. అతని దగ్గర నుంచి కూడా స్టేట్ మెంట్ తీసుకున్నారు. మరొక వైపు ఇందులో సంగీతం సకూర్చిన కీరవాణికి కూడా తలనొప్పులు తప్పెట్లు లేదు. ఎందుకంటే జైకూమర్ ఇప్పడు కీరవాణి మీద టార్గెట్ చేసి సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరొక వైపు ఈ కథ నా సొంతం అంటూ వర్మ కూడా సీసీఎస్ పోలీసులకు జైకూమార్ మీద ఒక్క ఫిర్యాదు చేశాడు. ఇదిలా వుంటే ఇప్పటికే అన్ని కోణాల్లో విచారణ ఆరంభించిన సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు వర్మకు పుల్ లెంత్ సినిమాను చూపెట్టబోతున్నట్లుగా సమాచారం.
అంతేగాకుండా ఈ పుల్ లెంత్ సినిమాలో వర్మకు ఎలాంటి ఆన్సర్లు ఇస్తాడో వేచి చూడాలి. మరోవైపు వర్మ రెండోసారి విచారణకు వస్తున్న తరుణంలో పోలీసుల ఎలాంటి చర్యలు తీసుకుంటారో అన్న ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు వర్మను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తు విశాఖపట్నంలో మహిళా సంఘాలు ఆందోళన చేస్తున్నాయి.