ఆర్జీవీ జాక్ పాట్ కొట్టాడు

ఆర్జీవీ చాలా తెలివైన వ్యక్తి. వ్యాపారం ఎలా చేయాలో తెలిసిన వాడు. ఎవరు ఏమనుకుంటేనేం తన లాభాలు తను చేసుకోవడం తెలిసిన వాడు. జనాల దృష్టిలో ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తున్నాడు అనుకుంటారు.…

ఆర్జీవీ చాలా తెలివైన వ్యక్తి. వ్యాపారం ఎలా చేయాలో తెలిసిన వాడు. ఎవరు ఏమనుకుంటేనేం తన లాభాలు తను చేసుకోవడం తెలిసిన వాడు. జనాల దృష్టిలో ఏదో పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తున్నాడు అనుకుంటారు. ఆయన మాత్రం లాభాలు చేసుకుంటాడు.

ఐస్ క్రీమ్ లాంటి చిన్న సినిమాలో కోటిన్నర లాభం కళ్ల చూసినవాడు. కొన్ని నిమిషాల పోర్నో సినిమా తీసి తొమ్మిది కోట్ల లాభం చేసుకున్నాడని టాక్. స్పైడర్, అజ్ఞాతవాసి లాంటి వంద కోట్ల సినిమాలకు కూడా ఇంత లాభం రాలేదు.

ఇప్పుడు నాగ్ ను తనతో సినిమా చేయడానికి ఒప్పించి, మాంచి లాభాలు కళ్ల చూస్తున్నట్లు టాలీవుడ్ లో కబుర్లు వినిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ, నాగార్జున అంటే తెలుగు సినిమా అని మన జనాలు ఫిక్సయిపోతారు. అదే సినిమాలో ముంబాయిలో కంటిన్యూగా షూట్ చేస్తూ, అక్కడి టెక్నీషియన్లను ఇతరత్రా వ్యవహారాలను వాడుతూ మల్టీ లాంగ్వేజ్ సినిమాగా కలరింగ్ ఇస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ మధ్య మన తెలుగు యాక్షన్ సినిమాలు అంటే చాలు హిందీ డిజిటల్, డబ్బింగ్, శాటిలైట్ జనాలు కోట్లు కురిపిస్తున్నారు. పెద్దస్టార్ల సినిమాలకు అక్కడి నుంచి 15 కోట్లకు పైగానే వస్తున్నాయి. ఇప్పుడు ఈ సినిమాకు కూడా ఆర్జీవీకి కనీసం 15 నుంచి 20కోట్లు వచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. హిందీ జనాలకు ఆర్జీవీ పేరు సుపరిచితం, అలాగే నాగ్ కూడా పరిచయమే. పైగా యాక్షన్ మూవీ. ఇంకేం కావాలి.

ఇప్పటికే తెలుగు థియేటర్ హక్కులు ఎవరికో తెలియడం లేదు కానీ, భారీ మొత్తానికి అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ అందుకున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకు మహా అయితే 20కోట్ల మించి ఆర్జీవీ ఖర్చు చేయడు. అయిదారు కోట్ల నాగ్ కు ఇస్తే, 15కోట్ల ప్రొడక్షన్ కు వాడతారు. ఆ మేరకు తెలుగు థియేటర్ రైట్స్ ద్వారా వస్తుంది.

హిందీ శాటిలైట్, డిజిటల్, తెలుగు శాటిలైట్, డిజిటల్ అంతా ఆర్జీవీ కంపెనీకి లాభమే లాభం. మరి జాక్ పాట్ కొట్టినట్లేగా.