Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

24న విడుదలల జోరు

24న విడుదలల జోరు

మరో రెండు రోజుల్లో బోలెడు రిలీజ్ లు. కానీ సినిమాలు కాదు. ప్రీ సమ్మర్, ఎగ్జామ్స్ సీజన్ కావడంతో ఇప్పుడు సినిమాలు ఏవీ పెద్దగా విడుదల కావడం లేదు. ఎప్పుడు థియేటర్లు దొరుకుతాయా? అని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టి వుంచిన అనేక చిన్న, డబ్బింగ్ సినిమాలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే మరి ఇంతకీ ఈ 24న విడుదలలు ఏమిటంటే...

అనేక పెద్ద సినిమాలకు సంబంధించిన పాటలు, ఇతరత్రా ప్రచార సామగ్రి అన్నమాట. రామ్ చరణ్-సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్..'రంగా.. రంగాస్థలాన' 24న విడుదలచేస్తారు.

వరుస హిట్ ల మీద వున్న నాని కృష్ణార్జున యుద్ధంలో సింగిల్ ఒకటి అదే రోజు విడుదల చేయబోతున్నారు. నిఖిల్ హీరోగా ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న కిర్రాక్ పార్టీకి సంబంధించి ఓ లిరికల్ వీడియో విడుదల చేయబోతున్నారు.

కళ్యాణ్ రామ్ తో ఎమ్మెల్యే సినిమా నిర్మిస్తున్నారు భరత్ చౌదరి. ఉపేంద్ర దర్శకుడు. ఈ సినిమా సింగిల్ ఒకటి కూడా 24నే విడుదల చేయబోతున్నారు. భరత్ అనే నేను కు సంబంధించి కూడా ఏదైనా వదులుదామనుకున్నారు. కానీ ఇవన్నీ వున్నాయని వాయిదా వేసారు. రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి విడుదల చేస్తారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?