Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'అదిగో' అన్నాడు.. ఇప్పటివరకు రాలేదు!

'అదిగో' అన్నాడు.. ఇప్పటివరకు రాలేదు!

నువ్వు కాకపోతే కుక్కను పెట్టి సినిమా తీస్తానంటాడు ఏదో సినిమాలో బ్రహ్మానందం. రవిబాబు మాత్రం నిజంగానే పందిని పెట్టి సినిమా తీశాడు. దానికి అదిగో అనే టైటిల్ కూడా పెట్టాడు. పంది పిల్లను పట్టుకొని ప్రచారం కోసం ఆ మధ్య ఏటీఎం సెంటర్ల చుట్టూ తిరిగాడు కూడా. ఇలా అదిగో.. ఇదిగో వస్తున్నామన్న రవిబాబు ఇప్పుడు ఎలాంటి చప్పుడు చేయడం లేదు.

ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతం అతీగతీ లేకుండా పోయింది. గ్రాఫిక్స్ తో ముడిపడ్డ సినిమా కావడంతో లేట్ అవుతుందని ఆమధ్య చెప్పుకొచ్చారు. కానీ నెలలు గడిచిపోయినా పంది బయటకు రాలేదు. సినిమాపై ఒక్క అప్ డేట్ కూడా లేదు.

ఔట్ పుట్ ఏమైనా తేడా కొట్టి సినిమాను పక్కనపెట్టేశారా అనే సందేహాలు కలుగుతున్నాయి. మామూలుగా ఓ సినిమా పూర్తిచేసి కానీ మరో సినిమా స్టార్ట్ చేయని రవిబాబు.. రిలీజ్ కాకముందే పంది పిల్ల సినిమాను ఏకంగా పక్కనపెట్టేశాడని టాక్. 

ప్రస్తుతం ఈ దర్శకుడు రాజ్ తరుణ్ తో మళ్లీ చర్చలు ప్రారంభించాడు. ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ అది. ఈ ప్రాజెక్టు కనుక వర్కవుట్ అయితే పంది పిల్ల పూర్తిగా పక్కకెళ్లిపోయినట్టే.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?