ఒకపక్క అతి త్వరలో విడుదల అంటూ స్టిల్స్ వదుల్తున్నారు కణం సినిమా గురించి. కానీ మరోపక్క ఆ సినిమా ఇదిగో అదిగో అంటోంది తప్ప రావడం కనిపించడం లేదు.
సాయిపల్లవి, నాగశౌర్య కాంబినేషన్ లో విజయ్ డైరక్షన్ లో తమిళ్ లో నిర్మించిన సినిమా ఇది. ఎ ఎల్ విజయ్ డైరక్షన్ అంటే సమ్ థింగ్ స్పెషల్ వుంటుంది. ఈ కణం సినిమా కూడా అలాంటి స్పెషల్ మూవీనే. అబార్షన్ల నేపథ్యంలో కడుపులోని పిండం పగతీర్చుకోవడం లాంటి కాన్సెప్ట్ ఏదో చేస్తున్నారని రూమర్ వుంది.
ఆ సంగతి అలా వుంచితే ఈ సినిమాకు మళ్లీ బ్రేక్ పడేటట్లు కనిపిస్తోంది. సినిమా తమిళ్ టైటిల్ మీద అక్కడ హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ టైటిల్ తనదని, అయిదేళ్ల క్రితమే రిజిస్టర్ చేసానని, సినిమా కూడా నిర్మాణంలో వుందని ఓ నిర్మాత హైకోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు లైకా ప్రొడక్షన్స్ కు ఆ టైటిల్ వాడకుండా స్టే ఇచ్చింది. అంతే కాదు, టైటిల్ కు ముందు వెనుక ఏదో పదం చేర్చి కూడా వాడకూడదని ఆదేశించింది.
మరి ఇప్పుడు సినిమా విడుదల చేయాలంటే టైటిల్ మార్చేయాలి. లేదా కోర్టులో కేసు పూర్తి చేసుకునే దాకా ఆగాలి. మరి లైకా ప్రొడక్షన్స్ ఏం చేస్తుందో చూడాలి. నిజానికి సాయిపల్లవి క్రేజ్ పీక్స్ లో వుంది. నాగశౌర్య కూడా రీసెంట్ గా ఓ హిట్ కొట్టాడు. ఇప్పుడు కనుక విడుదల చేస్తే, తెలుగులో మార్కెట్ బాగుంటుంది. కానీ అది సాధ్యమయ్యేలా కనిపించడం లేదు.