కిషోర్ తిరుమల-నాని ప్రాజెక్ట్ డ్రాప్?

వరుస హిట్ లతో దూకుడు మీద వున్న హీరో నానితో ప్రాజెక్టు అంటే ఎవరూ వదులుకోరు. అలాంటిది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం వదులుకోక తప్పలేదని తెలుస్తోంది.  Advertisement కిషోర్ తిరుమల డైరక్షన్ లో…

వరుస హిట్ లతో దూకుడు మీద వున్న హీరో నానితో ప్రాజెక్టు అంటే ఎవరూ వదులుకోరు. అలాంటిది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రం వదులుకోక తప్పలేదని తెలుస్తోంది. 

కిషోర్ తిరుమల డైరక్షన్ లో నానితో ఓ సినిమా తలపెట్టింది ఆ సంస్థ. అయితే లైన్ ఓకె కానీ, స్క్రిప్ట్ మీద మార్పులు చేర్పులు చెబుతూనే వున్నాడు హీరో నాని. ఎన్నిచేసినా, ఎంతచేసినా, ఎక్కడో ఏదో అసంతృప్తి వుండిపోయినట్లు తెలుస్తోంది.

దాంతో వన్ ఫైన్ మార్నింగ్ ఇరువర్గాలు కలిసి ఆ ప్రాజెక్ట్ ను డ్రాప్ చేసుకున్నట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అదే డైరక్టర్ తో, అదే సబ్జెక్ట్ తో, ఏదీ.. నానికి సంతృప్తి కలిగించని సబ్జెక్ట్ తోనే సినిమా మాత్రం చేయబోతున్నారు. నానికి బదులుగా హీరో సాయిధరమ్ తేజ వచ్చి చేరినట్లు తెలుస్తోంది.

అయితే ఈ సినిమా తేజు ఎప్పుడు చేస్తాడో మరి. ఎందుకంటే ప్రస్తుతం కేఎస్ రామారావు సినిమా చేస్తున్నాడు. తరువాత మారుతి సినిమా వుంది. గోపీచంద్ మలినేని సినిమా వుంది. ఏమైనా సాయిధరమ్ తేజ ఈ అవకాశాలు అన్నీ వాడుకుంటే మంచిదే.