జనవరి నెలాఖరుకు వద్దాం అనుకున్నాడు హీరో నిఖిల్ తన కిర్రాక్ పార్టీతో. కానీ పోటా పోటీగా సినిమాలు. మంచి డేట్ దొరకడంలేదు. ఆఖరికి ఏప్రెల్ కు వెళ్దాం అనుకున్నాడు. ఆఖరికి మార్చి 22న ఫిక్స్ అయ్యాడు. కానీ మళ్లీ మనసు మార్చుకున్నాడు. మార్చి 22న అయితే, వారం తరువాత రంగస్థలం వస్తుంది. చాలావరకు థియేటర్లు లేచిపోయే ప్రమాదం వుంది.
అందుకే మరోవారం ముందుకు వస్తున్నాడు. అంటే మార్చి 16న అన్నమాట. అలా అయితే రంగస్థలం సినిమాకు రెండువారాలు గ్యాప్ వుంటుంది. ప్రస్తుతానికి అయితే మార్చి పదహారులోపు పెద్దగా సినిమాలు ఏవీ ప్లానింగ్ లో లేవు. అప్పుడే సమ్మర్ హాలీడేస్ కొద్దిగా ప్రారంభం అవుతాయి. అందువల్ల ఓపెనింగ్స్ బాగుంటాయని అంచనా వేస్తున్నారు.
కిర్రాక్ పార్టీ సినిమాను ఏకె ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై, అనిల్ సుంకర నిర్మించారు. చందూ మొండేటి మాటలు, సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందించారు. శరన్ దర్శకుడు.