ఆ కాంబినేషన్ అయితే సూపరే..

తొలిప్రేమతో తొలిహిట్ అందుకున్నాడు డైరక్టర్ వెంకీ అట్లూరి. సహజంగా ఓ సినిమా హిట్ అయితే ఆ డైరక్టర్ కు ఆఫర్లు బాగానే వస్తాయి. ముందుగా అందరూ రుమాలేస్తారు. స్క్రిప్ట్ వుంటే చెప్పమని చెబుతారు. చేద్దాం…

తొలిప్రేమతో తొలిహిట్ అందుకున్నాడు డైరక్టర్ వెంకీ అట్లూరి. సహజంగా ఓ సినిమా హిట్ అయితే ఆ డైరక్టర్ కు ఆఫర్లు బాగానే వస్తాయి. ముందుగా అందరూ రుమాలేస్తారు. స్క్రిప్ట్ వుంటే చెప్పమని చెబుతారు. చేద్దాం అంటారు. కానీ వెంటనే ఎవరు చేస్తారు? ఏ హీరో రెడీగా వున్నారన్నది పాయింట్. ఇప్పుడు ఇదే ఆలోచనలో వెంకీ అట్లూరి కూడా వున్నట్లు తెలుస్తోంది.

అక్కినేని అఖిల్ ఇప్పుడు రెడీగా వున్నాడు. కథలు వింటున్నాడు. ఎవరు చెప్పినా కూడా. కానీ ఏవీ సరిగ్గా సెట్ కావడంలేదు. అందుకే వెంకీ ఈ అవకాశాన్ని వాడుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అఖిల్ ను కలిసి పాయింట్ చెప్పి, ఓకె చేయించుకుంటే, స్క్రిప్ట్ వర్క్ మొదలు పెట్టొచ్చు. 

తొలిప్రేమ నిర్మాతకే మలి సినిమా కూడా చేయాల్సి వుంది. అందువల్ల నిర్మాత సమస్య కూడా లేదు. అఖిల్ ను కలిసి, పాయింట్ చెప్పే పనిలో వెంకీ అట్లూరి వున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ మేరకు రాయబారాలు నడుస్తున్నాయి. ఆ లాంఛనం పూర్తయి, పాయింట్ ఓకె అయిపోతే అందరు హీరోల మాదిరిగానే అఖిల్ కూడా సెట్ లో వుంటాడు ఎక్కువగా. ఇప్పటిలా ఇంట్లో కాకుండా.