ఆ గ్యాసిప్ మళ్లీ బయటకు వచ్చింది

దాదాపు ఏడాది కిందటి నుంచి వినిపిస్తున్న గ్యాసిప్ ఒకటి వుంది. సావిత్రి సినిమా చేసిన పవన్ సాధినేని నందమూరి హీరోలతో ఒక సినిమా చేస్తారని. సావిత్రి సినిమా తరువాత మరో చాన్స్ కోసం కిందా…

దాదాపు ఏడాది కిందటి నుంచి వినిపిస్తున్న గ్యాసిప్ ఒకటి వుంది. సావిత్రి సినిమా చేసిన పవన్ సాధినేని నందమూరి హీరోలతో ఒక సినిమా చేస్తారని. సావిత్రి సినిమా తరువాత మరో చాన్స్ కోసం కిందా మీదా అవుతున్నారు పవన్ సాధినేని. ఏడాది కిందట కళ్యాణ్ రామ్ కోసం ఓ సబ్జెక్ట్ తయారు చేసి, అందులో హీరో తండ్రి హరికృష్ణకు కూడా ఓ పవర్ ఫుల్ పాత్రను తయారు చేసారు.

ఆ విధంగా కళ్యాణ్ రామ్ చేత ఓకె చేయించుకోవచ్చ అనుకున్నాడు పవన్. కానీ కళ్యాణ్ రామ్ స్వంతంగా చేసే ఆలోచనలో లేడు. అందుకే పవన్ సబ్జెక్ట్ అలా వుంచేసి ఎమ్మెల్యే సినిమాను పట్టాలెక్కించాడు.

ఆ తరువాత ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ సినిమా మొదలు పెట్టాడు. అయితే ఎమ్మెల్యే సినిమా పూర్తి కావడంతో మళ్లీ పవన్ సాధినేని పాత గ్యాసిప్ బయటకు వచ్చింది. లేదా బయటకు తీసారో?

విషయం ఏమిటంటే, ఎన్టీఆర్ ను కూడా కామియో క్యారెక్టర్ కు లాగేసి, హరికృష్ణను పెట్టి, కళ్యాణ్ రామ్ హీరో అంటే పెద్ద ప్రాజెక్టు అయిపోతుందని పవన్ సాధినేని ఆశ. కానీ ఆ ఆశకు ఎన్టీఆర్ సై అనేది లేదన్ననది బోగట్టా.

కళ్యాణ్ రామ్ తో హరికృష్ణ అన్నంత మాత్రాన వచ్చి పడిపోయే బజ్ ఏమీ లేదు. అందుకే ఈ ప్రాజెక్ట్ ఏడాదికి పైగా షెల్ఫ్ లోనే వుంది. మరి ఇప్పుడు మరోసారి బయటకు వచ్చింది కాబట్టి, కళ్యాణ్ రామ్ ఏమన్నా దృష్టి పెడతారేమో? కానీ షరతు ఏమిటంటే, నిర్మాత కావలెను.