లోగో ఎందుకు దీనికి పవనూ?

సినిమా వాళ్లు ఏం చేసినా సినిమా టైపులోనే వుంటుంది. రాజకీయాల్లో, ఎన్నికల్లో పాటలతో ఆకట్టుకోవడం అన్నది ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో ఊపందుకుంది. అంతకు ముందు కేవలం కమ్యూనిస్ట్ పార్టీలకు మాత్రమే ఈ పాటల…

సినిమా వాళ్లు ఏం చేసినా సినిమా టైపులోనే వుంటుంది. రాజకీయాల్లో, ఎన్నికల్లో పాటలతో ఆకట్టుకోవడం అన్నది ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంతో ఊపందుకుంది. అంతకు ముందు కేవలం కమ్యూనిస్ట్ పార్టీలకు మాత్రమే ఈ పాటల సరదా వుండేది. ఇప్పుడు జనసన వ్యవహారాలు కూడా అలాగే ఫక్తు సినిమా ఫక్కీలో వుంటున్నాయి.  జనసేన విడియోలు, సభల నిర్వహణ చిత్రీకరించి, పద్దతిగా ఎడిట్ చేసి, సంగీతం పాటలు జోడించి యూ ట్యూబ్ లో వదలడం ఇలాంటివి అన్నీ చేసుకుంటూ వస్తున్నారు.

లేటెస్ట్ గా జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అంటూ ఒకటి ఏర్పాటు చేస్తున్నారు. అంతకు ముందు యాక్షన్ కమిటీ అన్నారు. మళ్లీ పోరాటం వద్దు, నిజానిజాలు తేలుద్దాం అంటూ ఇలా మార్చారు. ఆ కమిటీలో ఎవరి పేర్లు వున్నాయి అన్నది ప్రస్తుతం ఇంకా సస్పెన్స్. ఇంకా ఈవిషయంలో టీజర్ నే కానీ, ట్రయిలర్ రాలేదు. ఇప్పటికైతే లోగో వచ్చింది బయటకు. పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ అక్కౌంట్ లో జాయింట్ ఫ్యాక్ట్ పైండిగ్ కమిటీకి లోగో విడుదలచేసారు.

ఇదే చిత్రంగా వుంది. సాధారణంగా పోరాట కమిటీ, అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అంటే లోగో కావాలి. ఎందుకంటే ధర్నాలు నిరసనలు చేస్తే, ఓ జాయింట్ జెండా అంటూ వుండాలి కాబట్టి లోగో అవసరం. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీకి లోగొ ఎందుకు? ఫ్యాక్ట్ ఫైండిగ్ కమిటీ అన్నది కొద్దిమంది మేధావులు (పవన్ దృష్టిలో మేధావులు అయినవారు కీలకం) కలిసి కూర్చుని తర్కించేది. దీనికి లోగో ఎందుకు? కానీ పవన్ సినిమా మనిషి కదా?

అందుకే ముందుగా టైటిల్ ప్రకటన, తరువాత లోగో విడదుల, ఆపై టీజర్, ట్రయిలర్ ఇలా వుంటుంది వ్యవహారం. టైటిల్ వచ్చింది, లోగో వచ్చింది. ఎవరెవరి పేర్లు వుంటాయన్నది ఇక సస్సెన్స్ పాయింట్. దానికి మళ్లీ ఫలానా నాడు, ఫలానా టైమ్ లో విడుదల చేస్తామని ప్రకటన, ఆపైన విడుదల ఇలా చాలా పద్యాలు వుంటాయి ఇంకా.