హైదరాబాద్ లో హవాలా గుట్టు రట్టు అయ్యింది. బడా వ్యాపారులకు హవాలా రూపంలో డబ్బులు సమాకూరుస్తున్న హవాలా వ్యాపారి పటేల్ నుంచి పోలిసులు రూ.కోటి 40లక్షలు స్వాదీనం చేసుకున్నారు. ఈ హవాలా రాకెట్ కు సంబంధించి అబిడ్స్, బంజారహిల్స్ ప్రాంతాలలో ఐటి అధికారుల సహయంతో పోలిసుల సోదాలు జరుపుతున్నారు.
ఇన్కంమ్ టాక్స్ అధికారుల సహయంతో సోదాలు జరుపుతున్న హైదరాబాద్ పోలిసులు. పోలిసుల అదుపులో గుజరాత్ కు చెందిన ప్రముఖ హవాలా వ్యాపారి పటేల్. హైదరాబాద్ లో బడా వ్యాపారులకు హవాలా రూపంలో డబ్బులు సప్లై చేస్తున్న పటేల్. గుజరాత్ కు చెందిన పటేల్ తన హవాలా రాకెట్ ద్వారా బడా వ్యాపారులకు పెద్ద మొత్తంలో డబ్బులు సమకూరుస్తున్నట్టు పోలిసులు భావిస్తున్నారు. అతని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
1కోటి 40లక్షలు నగదు స్వాదీనం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అబిడ్స్ లోని మహాలక్ష్మి జెమ్స్ అండ్ జువెలర్స్ లో సాగుతున్న హవాలా గుట్టు రట్టు చేసింది. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలిసులు. జయేష్ పటేల్ అలియాస్ అరుల్ ప్రధాన నిందితుడు. వనరాజ్ సింహ్, బామర్ సింహ్, పటేల్ ప్రదీప్ కుమార్, గణేష్ సత్యనారాయణ్ సాబూ, బొనబోయిన విజ్ఞేశ్వర్, అరుణ్ కుమార్ వారు ఉన్నారు.
గుజరాత్ కు చెందిన జయేష్ పటేల్ 2009లో హైదరాబాద్ కు వచ్చి స్దిరపడి బంగారం, వజ్రాల వ్యాపారం సాగించేవాడు. కుటుంబంతో సహా హైదరాబాద్ లోనే స్దిరపడిపోయాడు. అబిడ్స్ లో ప్లాట్ నెం..30 ౩rd ఫ్లోర్ మహలక్ష్మి జెమ్స్ & జువెలర్స్, చీరంగ్ ఆలీ లైన్, అబిడ్స్ లో కోందరు పనివాళ్లతో ఉండెవాడు. ఇక్కడే హవాలా రాకెట్ వ్యాపారం జరిగే ప్రాంతం ఇది.
ఈనేపధ్యంలో హవాలా వ్యాపారులతో పరిచయాలు ఏర్పడి జయేష్ 0.6 to0.8% కమీషన్ కు హవాలా రూపంలో డబ్బులు మార్చేవాడు. వాట్స్ ఆప్ లో ఓనోటు సీరియల్ నెంబర్ ను పంపడం ద్వారా బ్లాక్ మనీని వైట్ గా, వైట్ ను బ్లాక్ గా మార్చేవాడు.
రాయలసీమ స్టీల్ రీ రోలింగ్ స్కాన్ ఎనర్జీ పవర్ లిమిటెడ్ సంస్దలకు హవాలా ద్వారా డబ్బులు మార్చేవాడు. హవాలా వల్ల జీఎస్టీకి నష్టం వాటిల్లుతోంది. డిప్యూటి డైరెక్టర్ ఐటి రాజెష్, ఉత్తరమండలం డీసీపీ రాధాకీషన్ ఈ ఆపరేషన్ లో పాల్గోన్నారు. స్వాధీనం చేసుకున్న డబ్బులను ఇన్ కంట్యాక్స్ విభాగానికి అప్పగించారు.
హైదరాబాద్ లో హవాలా రాకెట్ ను అరెస్ట్ చేశాం. జయేష్ కుమార్ పటేల్ అనే డైమండ్స్ వ్యాపారి హవాలా రాకెట్ నడుపుతున్నాడు. అబిడ్స్ ను అండాగా చేసుకొని ఏజెంట్లతో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చుతున్నాడు. 6, 8 పర్సెంటేజ్ తో హవాలా డబ్బులు చేతులు మారుతున్నాయి. వాట్సాప్ లో కరెన్సీ నోట్ల సీరియల్ నంబర్స్ తో డబ్బులు మార్పడి జరుగుతుంది.
రాయలసీమ స్టీల్ రీ రోలింగ్ మిల్స్ ప్రయివేట్ లిమిటెడ్ ,స్కాన్ ఎనర్జీ పవర్ లిమిటెడ్ కంపెనీల ద్వారా డబ్బులను హవాలా చెసున్నారు. జయేష్ కుమార్ ప్రతీ ఏడాది 200కోట్ల హవాలాకు పాల్పడ్డాడు. ఆరుగురిని అరెస్ట్ చేసి 40లక్షల 80వేల రూపాయలు, క్యాష్ కౌంటింగ్ మిషన్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నాము అని హైదరాబాద్ సీపీ వివి.శ్రీనివాస్ రావ్ చేప్పారు.