Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఉగాదికి ఎన్టీఆర్ బయోపిక్ కు శ్రీకారం?

ఉగాదికి ఎన్టీఆర్ బయోపిక్ కు శ్రీకారం?

ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పట్లో వచ్చేది కాదు. దానికి చాలా టైమ్ వుంది. ఎందుకంటే అంతకు ముందుగా తేజ దర్శకత్వంలో వెంకీ సినిమా పూర్తి కావాలి. అదో మూడు నెలలు పడుతుంది.

పైగా బాలయ్య ఇప్పుడు లేపాక్షి ఉత్సవాల్లో బిజీగా వున్నారు కూడా. అదే కాకుండా నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటి తను, మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ తో తీస్తున్న సినిమాతో బిజీగా వున్నారు. ఇంత కథ వుంది ఇప్పుడు.

అయితే సంక్రాంతి సందర్భంగా హడావుడిగా టీజర్ కోసం కిందా మీదా పడ్డారు. టీజర్ షూట్ చేసారు. కానీ బాగా రాలేదని వార్తలు, ఆపై బాలయ్య బాబు డైరక్టర్ తేజ మీద గుస్సాయించారని గ్యాసిప్ లు వినిపించాయి. నిజానికి బయోపిక్ స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ అయింది. కానీ సెట్ మీదకు వెళ్లడానికి టైమ్ పడుతుంది. ఈలోగా ఎన్నికలు డిసెంబర్ లో ముంచుకు వస్తే కథ వేరుగా వుంటుంది.

కానీ సినిమాకు కొబ్బరికాయ అయితే కొట్టాలి కదా? అందుకే, దానికే ఉగాది రోజున మంచి ముహర్తంగా ఎంచుకున్నారు బాలయ్య అని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ రోజు లాంఛనంగా శ్రీకారం చుట్టాలని బాలయ్య అనుకుంటున్నారట. ఆ తరువాత సెట్ మీదకు వెళ్లడం అన్నది బాలయ్య, తేజ ఇద్దరు ఫ్రీ కావడం బట్టి వుంటుంది. మరి బయోపిక్ ఫంక్షన్ ను భారీగా చేస్తారా? లాంఛనంగా చేస్తారా? అన్నది తెలియాల్సి వుంది.

ఇంతకూ ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ కు ఆయన మలి భార్య లక్ష్మీపార్వతిని ఆహ్వానిస్తారంటారా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?