అఖిల్ సినిమా పరాజయం టైమ్ లో దర్శకుడు వివి వినాయక్ పెద్ద మనసుతో తన పది కోట్లకు పైగా పారితోషికంలో మూడు కోట్ల వరకు వెనక్కు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి తలెత్తింది. నిజం చెప్పాలంటే ఈసారి ఇంకా చిత్రమైన పరిస్థితి. ఇంటిలిజెంట్ సినిమాను పూర్తిగా తన భుజాలపై వేసుకున్నారు వివి వినాయక్.
కేవలం మేకింగ్ మాత్రమే కాదు, సినిమాను మార్కెట్ చేయడంలో, ప్రమోట్ చేయడంలో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. సీడెడ్ ఏరియాను భారీ రేట్ కు ఆయన మాటమీద, ఆయనతో స్నేహం వున్నవాళ్లే కొన్నారు. అలాగే ఆంధ్రలోని కొన్ని ఏరియాలు కూడా.
సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ ను ఆయనే స్వయంగా అర్థించారు. వెన్యూ రాజమండ్రిని ఆయనే ఫిక్స్ చేసారు. ఇలా అన్నీ తానై వ్వవహరించిన వినాయక్ ఈ సినిమాకు రెమ్యూనిరేషన్ కేవలం ఏడున్నర కోట్లు మాత్రమే తీసుకున్నారు. అలాగే హీరో సాయి ధరమ్ కు జస్ట్ రెండున్నర కోట్లే ఇచ్చినట్లు వినికిడి.
ఇప్పుడు సినిమా పరాజయానికి వినాయక్ నే అందరూ వేలెత్తి చూపిస్తున్నారు. పైగా బయ్యర్లు కొన్నది వినాయక్ ను చూసే. కానీ వినాయక్ ఎంత అని వెనక్కు ఇవ్వగలరు. మహా అయితే తను కొనిపించిన ఒకరిద్దరికి ఒకటో రెండో సర్దగలరేమో? లేదూ అంటే నిర్మాత కళ్యాణ్ కు మరో సినిమా ఫ్రీగా చేసిపెట్టగలరు. అంతే.