Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పవన్ హీరో ‘మోహన్ రంగ’

పవన్ హీరో ‘మోహన్ రంగ’

త్రివిక్రమ్ శ్రీనివాస్ కథ తయారుచేసారు. పవన్ కళ్యాణ్ సమర్పకుడు. కథలో హీరో పేరు మోహన్ రంగ. అందుకే సినిమా టైటిల్ చల్ మోహన్ రంగ అయిందట. నితిన్ లెటెస్ట్ సినిమా టైటిల్ వెనుక వున్న ఆసక్తికరమైన విషయం అదేనట.

నిజానికి ఛల్ మోహన్ రంగా అనగానే ఎప్పుడో సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమా టైటిల్ మళ్లీ వాడుతున్నారని అనుకున్నారు. కానీ అది కాదు, కథలో హీరో పేరు మోహన రంగా అని అందుకే సినిమాకు టైటిల్ అలా పెట్టారని తెలుస్తోంది.

మోహన్ రంగా అన్న పేరు కోస్తా జిల్లాల్లో కాపు సామాజిక వర్గం ఆరాధ్యుడిగా భావించే నాయకుడిది కూడా కావడం గమనార్హం. రంగగా, ఫేమస్ అయిన వంగవీటి రంగా పూర్తి పేరు వంగవీటి మోహన్ రంగానే.

ఈ పేరును పవన్ ఆత్మీయుడు రాసిన కథలో హీరోకి వుంచడం, పవన్ సినిమా నిర్మాణంలో పాలు పంచుకోవడం విశేషం. మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?