చీప్ ట్రిక్: సోషల్ మీడియాలో కాలా ఫైట్

మొన్నటివరకు బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఓ టీప్ ట్రిక్ ఇప్పుడు కోలీవుడ్ కు కూడా వచ్చింది. అదేంటంటే.. మేకర్స్ తమ సినిమా క్లిప్ ను తామే లీక్ చేస్తారు. అయ్యో లీక్ అయిపోయింది…

మొన్నటివరకు బాలీవుడ్ కు మాత్రమే పరిమితమైన ఓ టీప్ ట్రిక్ ఇప్పుడు కోలీవుడ్ కు కూడా వచ్చింది. అదేంటంటే.. మేకర్స్ తమ సినిమా క్లిప్ ను తామే లీక్ చేస్తారు. అయ్యో లీక్ అయిపోయింది కాపాడండంటూ గగ్గోలు పెడతారు. దీంతో సదరు క్లిప్ కు క్లిక్కుల మీద క్లిక్కులు వస్తాయి. సినిమాకు విపరీతమైన మైలేజీ, ఫ్రీగా పబ్లిసిటీ. 

ఇప్పుడీ చెత్త ట్రిక్ ను కాలా యూనిట్ ఫాలో అయిందంటూ కోలీవుడ్ లో పుకార్లు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కాలా సినిమాకు సంబంధించి ఓ క్లిప్ లీక్ అయింది. రజనీకాంత్ ఆవేశంగా విలన్ ను కొడుతున్న క్లిప్ అయింది. ప్రస్తుతం నెట్ లో వైరల్ అవుతున్న ఈ క్లిప్ ను యూనిట్ సభ్యులే లీక్ చేసి, వైరల్ చేశారనేది హాట్ టాపిక్.

నిజానికి రజనీకాంత్ సినిమాకు ఇలాంటి చీప్ పబ్లిసిటీ స్టంట్ అక్కర్లేదు. అతడి సినిమాలు ఎలా ఉన్నా ఓపెనింగ్స్ అదిరిపోతాయి. కానీ యూనిట్ సభ్యులే కావాలని ఇలా చేయడానికి ఓ కారణం ఉంది. గతంలో రజనీకాంత్, దర్శకుడు రంజిత్ కాంబినేషన్ లో కబాలి సినిమా వచ్చింది. అది కాస్తా ఫ్లాప్ అయింది. ఆ దెబ్బతో కాలా సినిమాకు ప్రీ-రిలీజ్ బిజినెస్ తగ్గింది. 

పైగా ఇది రజనీకాంత్ అల్లుడు ధనుష్ స్వయంగా నిర్మిస్తున్న సినిమా. రజనీకాంత్ రాజకీయాలపై దృష్టిపెట్టిన నేపథ్యంలో.. మామ మళ్లీ తనకు సినిమా చేస్తాడనే ఆశ ధనుష్ కు లేదు. అందుకే ఉన్నంతలో కాలాతోనే మ్యాగ్జిమమ్ పిండుకోవాలని ఆశ. అందుకే ఇలా కావాలనే క్లిప్ లీక్ చేసి, సినిమాకు రేటు పెంచే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.