సాయిధరమ్ సినిమాల్లో మార్పులు

అనుభవం అయితే తత్వం బోధపడుతుంది. యువ హీరోలు అంతా వైవిధ్యమైన కథాంశాలు తీసుకుంటే, తాను మాత్రం మాస్ మంత్రం జపిస్తూ, ఫైట్లు, డ్యూయెట్లు, హీరోయిజం మీద దృష్టి పెడుతూ వచ్చాడు. ఫలితం మిగిలిన హీరోలు…

అనుభవం అయితే తత్వం బోధపడుతుంది. యువ హీరోలు అంతా వైవిధ్యమైన కథాంశాలు తీసుకుంటే, తాను మాత్రం మాస్ మంత్రం జపిస్తూ, ఫైట్లు, డ్యూయెట్లు, హీరోయిజం మీద దృష్టి పెడుతూ వచ్చాడు. ఫలితం మిగిలిన హీరోలు హిట్ ల మీద హిట్ లు కొడుతుంటే తేజ్ ఫ్లాప్ ల మీద ప్లాప్ లు ఇస్తున్నాడు.

ఎప్పడైతే ఇంటిలిజెంట్ ఫలితం తేడా వచ్చిందో ఇప్పుడు ఇటు తేజ్ అటు నిర్మాతలు కూడా మనసు మార్చుకున్నారు. తేజ్ తరువాతి సినిమా కరుణాకర్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు. కేఎస్ రామారావు ఇప్పుడు బడ్జెట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వినికిడి. హీరో,  డైరక్టర్ రెమ్యూనిరేషన్ తో సహా. అలాగే ఈ సినిమాలో ఒకే ఒక్క ఫైట్ వుంటుందట. లవ్ జోనర్ ఎక్కువ వుంటుందట.

ఇక భగవాన్ పుల్లారావు నిర్మించే గోపీచంద్ మలినేని సినిమాకు కూడా జాగ్రత్తలు మొదలయ్యాయి. ప్యాడింగ్ ఆర్టిస్లులు, ఎంటర్ టైన్ మెంట్ పార్ట్ బాగా వుండేలాగా, హీరోచిత వ్యవహారాలు తగ్గించేలా చూస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ పెంచుతున్నారు. అలాగే ఈ సినిమాకు సాయిధరమ్ కు ఇష్టమైన థమన్ ను కాకుండా, దేవీశ్రీప్రసాద్ ను తీసుకుంటున్నారు. సాయిధరమ్ సినిమాకు దేవీశ్రీ ప్రసాద్ పనిచేయడం ఇదే ఫస్ట్ టైమ్ అవుతుంది.

సాయిధరమ్ వైపు నుంచి కూడా మార్పురావాలి. జీన్స్, పోలికలు అని సాకు చెప్పడం కాకుండా, చిరంజీవిలా కామెడీ సీన్లు చేయాలి. చిరులా డ్యాన్స్ లు చేయాలి వంటి తాపత్రయం తగ్గించుకోవాలి. లేదూ అంటే మెగా క్యాంప్ హీరోల్లో వెనకబడిపోవడం అన్నది అనుమానం అయితేకాదు.