రేపే రంగస్థలం తొలిపాట

రంగస్థలం సినిమా షూట్ పార్ట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సుకుమార్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఫిక్సయిపోయారు. అదే టైమ్ లో ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేసారు. మొన్నటికి మొన్న విడుదల చేసిన…

రంగస్థలం సినిమా షూట్ పార్ట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. సుకుమార్ ఎడిటింగ్ టేబుల్ దగ్గర ఫిక్సయిపోయారు. అదే టైమ్ లో ప్రమోషన్ వర్క్ స్టార్ట్ చేసారు. మొన్నటికి మొన్న విడుదల చేసిన సమంత టీజర్ కు విపరీతమైన అప్లాజ్ వచ్చింది. దాదాపు అన్నీకలిపి పదిలక్షల వ్యూస్ వచ్చాయి. ఆ ఉత్సాహంతో ఫస్ట్ సాంగ్ ను రేపు విడుదల చేస్తున్నారు.

హీరోయిన్ సమంతను తలుచుకుంటూ, హీరో రామ్ చరణ్ పాడే ప్రేమగీతాన్ని తొలిసాంగ్ గా విడుదల చేయబోతున్నారు. సుకుమార్ అంటేనే ప్రాణంపెట్టి మ్యూజిక్ ఇఛ్ఛే దేవీశ్రీ ప్రసాద్ ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నాడో రేపు తెలుస్తుంది. ఇలా ఒక్కోపాట వదుల్తూ, మార్చి ఫస్ట్ వీక్ లో జ్యూక్ బాక్స్ కంప్లీట్ చేస్తారు.

వైజాగ్ లో ఈవెంట్ -రంగస్థలం ఈవెంట్ భారీగా మార్చి మూడోవారంలో వైజాగ్ లో వుంటుంది. అప్పుడే ట్రయిలర్ విడుదల వుంటుంది. సమంత, రామ్ చరణ్ లతో 1985 నాటి పీరియడ్ ఫన్ ఎంటర్ టైనర్ ను సుకుమార్ ఎలా చూపించబోతున్నారో అప్పటికి కానీ ఓ క్లారిటీరాదు. అంతవరకు జ్యూక్ బాక్స్ హంగామాతోనే ప్రమోషన్ వుంటుంది.