సక్సెస్ ఉంటేనే ఇండస్ట్రీలో మనుగడ. ఎలాగోలా ఓ హిట్ ఇస్తే అదే అవకాశాలు తెచ్చిపెడుతుంది. అప్పటివరకు లేని గుర్తింపును ఆపాదిస్తుంది. ఇప్పుడు దర్శకుడు అశోక్ విషయంలో అదే జరుగుతోంది. భాగమతి మూవీతో సక్సెస్ కొట్టిన ఈ దర్శకుడికి వెంకటేష్ పిలిచి మరీ ఆఫర్ ఇచ్చాడట.
ఇదే అశోక్ ను గతంలో విపరీతంగా తిప్పించుకున్నాడు వెంకీ. ఓ కథ రాసి వెంకీకి వినిపించిన పాపానికి సిట్టింగ్స్ మీద సిట్టింగ్స్ ఏర్పాటుచేసి చుట్టూ తిప్పుకున్నాడు. ఈ విషయంలో వెంకీ కంటే నిర్మాత సురేష్ బాబుదే ఎక్కువ తప్పు కనిపిస్తుంది. అది వేరే విషయం. అలా దగ్గుబాటి కాంపౌండ్ చుట్టూ రెండేళ్లపాటు తిరిగిన అశోక్.. చివరికి సినిమా చేయకుండానే బయటకొచ్చాడు.
మళ్లీ భాగమతి సక్సెస్ తో దగ్గుబాటి కాంపౌండ్ నుంచి అశోక్ కు పిలుపువచ్చింది. మరి ఈసారి వెంకటేశ్ ఇంకో కథ రాయమంటాడా.. లేక పాతకథకే మార్పులు చేసి తీసుకురమ్మంటాడా అనేది తేలాల్సి ఉంది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈసారి అశోక్ జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు.
2-3 సిట్టింగ్స్ లో ప్రాజెక్టు ఫైనల్ అయితే ఓకే, లేదంటే వేరే హీరోతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి ముందుగానే ప్లాన్ రెడీ చేసుకున్నాడు. వెంకీతో సినిమా ఓకే అవ్వకపోతే, అప్పుడు ప్లాన్-బి బయటకు తీస్తాడట అశోక్.