ఒక హీరోయిన్‌కి అనుగుణంగా సినిమా షెడ్యూల్స్ ప్లాన్ చేయడం, హీరోలు సైతం తమ ప్లాన్లు మార్చుకోవడం తెలుగు ఇండస్ట్రీలో అయితే జరగదు. అలాగే కథ నచ్చక ఒక సినిమాని రిజెక్ట్ చేయడం, పాత్ర సరిగా లేదని కంప్లయింట్ చేయడం కూడా హీరోయిన్లకి అలవాటు లేదు. ఏ పాత్రనిస్తే దానిని, ఎప్పుడు డేట్లు ఇమ్మంటే అప్పుడు ఇచ్చి అణకువగా నడుచుకుంటారు హీరోయిన్లు.
కానీ సాయి పల్లవి ఈ మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో తన మాటే నెగ్గేట్టు చూసుకుంటోంది. తన డేట్స్ కోసం పలు సినిమాల షెడ్యూల్స్ మారుతున్నాయి. తనకి కథ నచ్చుతుందో లేదోనని నిర్మాతలు బెంగపడిపోతూ తనకోసమే జాగ్రత్తగా కథలు, క్యారెక్టర్లు రాయిస్తున్నారు. స్టార్ హీరోల దృష్టి తనపై పడకపోయినా కానీ సాయిపల్లవి మాత్రం తన స్థాయిలో తాను స్టార్డమ్ ఎంజాయ్ చేస్తోంది.
యూత్‌లో తనకి క్రేజ్ పీక్స్‌లో వుండడంతో, అన్నిటికీ మించి అపర టాలెంటెడ్ అవడంతో సాయి పల్లవి తనకంటూ ఒక రేంజ్ మెయింటైన్ చేస్తోంది. మరీ ఇంత లెవల్ వేయడం తగదని అనేవాళ్లున్నా సక్సెస్‌లో వున్న హీరోలకి అడుగులకి మడుగులు ఒత్తే నిర్మాతలు ఫర్ ఏ ఛేంజ్ హీరోయిన్లకీ అలా చేయడం మంచి పరిణామమే అనేవాళ్లూ వున్నారు. మొత్తానికి తనకి ఫిదా అయిన తెలుగు ప్రేక్షకుల అండగా సినిమా ఇండస్ట్రీని సాయి పల్లవి ఒక ఆట ఆడించేస్తోంది.