ప్రైవసీ కోసం అనుకోవచ్చు, దూరంగా పారిపోయి పెళ్లి చేసుకున్నారని అనుకోవచ్చు, కొత్తదనం కోసం కావొచ్చు.. చాలామంది సెలబ్రిటీలు ఇప్పుడు డెస్టినేషన్ వెడ్డింగ్ వెంట పడుతున్నారు. సంపన్న కుటుంబాల్లో నడుస్తున్న ఈ ట్రెండ్ ను దీపిక పదుకోన్ కూడా ఫాలో అయిపోవడానికి రెడీ అవుతోంది.
బాలీవుడ్ హాట్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపిక పదుకోన్ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీళ్లు పెళ్లి కూడా చేసుకుంటారంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. వీటికి మరింత ఊతమిచ్చేలా ఈమధ్యే కుటుంబ సభ్యులతో పాటు ఈ జంట విదేశాలు చుట్టివచ్చింది.
తాజాగా ఈ జంట బీచ్ వెడ్డింగ్ చేసుకోవాలని నిర్ణయించుకుందట. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ అందమైన సముద్ర తీరమున్న ఓ సుందర నగరాన్ని ఫిక్స్ చేసుకున్నారట రణ్వీర్, దీపిక.
రీసెంట్ గా అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఇటలీ వెళ్లి మరీ పెళ్లి చేసుకున్నారు. ఆ మధ్య సమంత, నాగచైతన్య గోవాలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు రణ్వీర్, దీపిక ఏ దేశం వెళ్లి పెళ్లి చేసుకుంటారో చూడాలి.