వెరైటీ కథలు నాకెందుకో చెప్పడంలేదు

అందరు యువ కథానాయకులు వైరైటీ కథలతో సినిమాలు చేస్తుంటే, సాయిధరమ్ తేజ్ మాత్రం మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్లే ఎక్కువగా చేస్తున్నారు. అదే.. ఎందుకని అడిగితే, అసలు తనకు ఎవ్వరూ ఔట్ ఆఫ్ ది…

అందరు యువ కథానాయకులు వైరైటీ కథలతో సినిమాలు చేస్తుంటే, సాయిధరమ్ తేజ్ మాత్రం మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్లే ఎక్కువగా చేస్తున్నారు. అదే.. ఎందుకని అడిగితే, అసలు తనకు ఎవ్వరూ ఔట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలు, వెరైటీ కథలు చెప్పడం లేదంటున్నారు.

మరి ఎందుకో తన దగ్గరకు వచ్చే డైరక్టర్లు, కథకులు అంతా కమర్షియల్ ఫార్మాట్ కథలే చెబుతున్నారని, వెరైటీ కథల కోసం తాను చూస్తున్నానని అన్నారు సాయిధరమ్ తేజ్.

ఇంటిలిజెంట్ ప్రమోషన్లలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నాలుగు ఫ్లాపు సినిమాల తరువాత చేస్తున్న సినిమా ఇంటిలిజెంట్ అని తేజ్ అన్నారు. ఈసినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్ములాతో వుంటూనే, చిన్న అండర్ కరెంట్ మెసేజ్ వుంటుందన్నారు. ఆకుల శివ కథను దర్శకుడు వివి వినాయక్ ఇంప్రూవ్ చేసి, విజువలైజ్ చేసిన తీరు బాగుందన్నారు.

జవాన్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నా అని, కానీ సినిమా విజయం సాధించలేకపోయిందని అన్నారు. కరుణాకరన్ డైరక్షన్ లో తరువాతి సినిమా కొంతవరకు షూటింగ్ అయ్యిందన్నారు.

తాను, వరుణ్ తేజ్ కూర్చుని మాట్లాడుకున్న తరువాతే తొలిప్రేమ డేట్ మార్చామని, ఇలాంటివి తప్పవని అన్నారు. మెగా హీరోలు పెరగడం వల్ల ఇలాంటి సమస్యలు ఇంకా వస్తాయేమో అని అంటే, అంతే అన్నట్లు నవ్వేసి ఊరుకున్నారు.

రెండు సినిమాలు హిట్ అయితే, తాను, వరుణ్ కలిసి ఒకేసారి సక్సెస్ మీట్ చేస్తామని తేజ్ అన్నారు.

సాయిధరమ్ తేజ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి