గణితన్ సినిమాలో మీడియా హెడ్ గా మాంచి రోల్ పోషించింది కేథరిన్. ఆ సినిమాను తెలుగులో తీస్తుంటే, తనంతట తానే విల్లింగ్ ఇచ్చేసింది. సరే అని నిర్మాతలు కాస్త అటు మొగ్గారు. చూద్దాం అని హీరో నిఖిల్ కూడా అనుకున్నాడు.
కానీ ఈవార్త బయటకు రాగానే హీరోయిన్ లా వుండదు. అక్కలా వుంటుంది అనే ఫీడ్ బ్యాక్ ఇటు నిర్మాతలకు అటు హీరోకు రావడం ప్రారంభమైందట. సహజంగానే కేథరిన్ కాస్త మాంచి ఫిజిక్ తో వుంటుంది. దాంతో పునరాలోచనలో పడ్డారు.
కానీ సమస్య అంత సులువుగా తెగేలాలేదు. ఎందుకంటే కాస్తయినా ఫేస్ వాల్యూ వున్న హీరోయిన్ వుంటే బాగుండును అని వుంది. కానీ అలా వున్నవారు అంతా పెద్ద హీరోలకేసి చూస్తున్నారు. అందుకే నాగచైతన్య సవ్యసాచిలో చేస్తున్న నిధి అగర్వాల్ ను కానీ, నితిన్ తో రెండు సినిమాలు చేసిన మేఘా ఆకాష్ ను కానీ ట్రయ్ చేయాలని చూస్తున్నారు.