అవును.. ఆ వీడియోలు తీసింది నేనే?

మస్తాన్ సాయికి డ్రగ్స్ ఎక్కడ్నుంచి వస్తున్నాయి, సిటీలో ఎవరికి అతడు సరఫరా చేస్తున్నాడనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు.

మస్తాన్ సాయి పోలీస్ కస్టడీ ముగిసింది. 3 రోజుల పోలీస్ కస్టడీ తర్వాత తిరిగి అతడ్ని చంచల్ గూడ జైలుకు తరలించారు. విచారణలో భాగంగా అతడికి చెందిన హార్డ్ డిస్క్ పై ప్రశ్నించిన పోలీసులను పెద్దగా ఇబ్బంది పెట్టలేదంట మస్తాన్ సాయి. ఆ వీడియోలన్నీ తీసిందే తానేనని, అన్నీ ఉద్దేశపూర్వకంగానే చేశానని అంగీకరించాడు.

ఎంతోమంది యువతులకు పార్టీ ఏర్పాటుచేసి, ఆ పార్టీల్లో డ్రగ్స్ అలవాటు చేశానని అంగీకరించాడు మస్తాన్ సాయి. అలా డ్రగ్స్ మత్తులో ఉన్న అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడి ఆ వీడియోలు చిత్రీకరించినట్టు తెలిపాడు. అలా షూట్ చేసిన వీడియోలతో తిరిగి వాళ్లనే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించినట్టు వెల్లడించాడు.

మస్తాన్ సాయికి డ్రగ్స్ ఎక్కడ్నుంచి వస్తున్నాయి, సిటీలో ఎవరికి అతడు సరఫరా చేస్తున్నాడనే కోణంలో పోలీసులు ప్రశ్నించారు. బెంగళూరు, గోవా నుంచి డ్రగ్స్ తెస్తున్నట్టు అంగీకరించిన మస్తాన్ సాయి, తను ఎవ్వరికీ డ్రగ్స్ సరఫరా చేయలేదని, కేవలం తన పార్టీల కోసం వాడుకున్నట్టు వెల్లడించాడు.

లావణ్య తనకు ఎక్కడ, ఎలా పరిచయమైందనే విషయాల్ని పోలీసులకు వెల్లడించాడు మస్తాన్ సాయి. ఆమెకు కూడా డ్రగ్స్ ఇచ్చినట్టు, పలుమార్లు అత్యాచారం చేసినట్టు అంగీకరించాడు. అయితే తను లావణ్యపై అత్యాచారం చేయలేదని, ఆమె అంగీకారంతోనే ఇద్దరం శృంగారం చేసినట్టు పోలీసులకు చెప్పాడట.

మరోవైపు మస్తాన్ సాయి వ్యవహారంతో అతడి తండ్రి ధర్మ కర్త పోస్టు ఊడిపోయేలా ఉంది. గుంటూరులోని మస్తాన్ దర్గా ధర్మకర్తగా కొనసాగే అర్హత మస్తాన్ సాయి తండ్రికి లేదంటూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు లేఖ అందింది.

నాగూర్ బాబు అనే అడ్వకేట్, గవర్నర్ కు ఈ లేఖ రాశారు. మస్తాన్ సాయి తండ్రి రావి రామ్మోహన్ రావు కుటుంబం వారసత్వంగా తరాలుగా మస్తాన్ దర్గా ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. మస్తాన్ సాయి చేసిన పనితో దర్గా ప్రతిష్ఠ మసకబారిందని, దర్గాకు వచ్చే భక్తుల భద్రతకు కూడా ముప్పు ఉందని లేఖలో పేర్కొన్నారు లాయర్. ప్రభుత్వం లేదా వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో దర్గాను నడపాలని కోరారు.

17 Replies to “అవును.. ఆ వీడియోలు తీసింది నేనే?”

  1. ఆంటే మస్తాన్ సాయి కి ప్యాలస్ లో కి ఆహ్వానం, పార్టీ లో పదవి గ్యారెంటీ అన్నమాట. నాయకుడు మనసుకి నచ్చిన పనులు అన్నీ చేసేశాడు.

    1. ఉత్తరాంధ్ర ఇంచార్జి చేస్తారు..

      వైసీపీ క్యాడర్ లో జోష్ పెరుగుతుంది..

  2. ఇప్పుడు GA మస్తాన్ సాయీ కి టీడీపీ కి ఉన్నటువంటి సంబంధాలు వెతికి …లేకపోయినా ఉన్నట్లు కల్పిత కథలు రాసి కనీసం ఏదో ఒక లింక్ ఉన్నట్లు వెతక బోతుంది

Comments are closed.