హ‌లో.. మీ ఎమ్మెల్యే/ మంత్రి కూడా ఇంతేనా?

త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ నెగెటివిటీని కూట‌మి నేత‌లు ఎదుర్కొంటున్నార‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది.

ఈ నెల 12వ తేదీకి కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న 8 నెల‌లు పూర్తి చేసుకుంది. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల కంటే, ఇత‌రేత‌ర అంశాలే ప్ర‌భుత్వానికి ప్రాధాన్యం అయ్యాయ‌నే మాట బ‌లంగా వినిపిస్తోంది. ఇదే సంద‌ర్భంలో త‌క్కువ స‌మ‌యంలోనే ఎక్కువ నెగెటివిటీని కూట‌మి నేత‌లు ఎదుర్కొంటున్నార‌నే చ‌ర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఇచ్ఛాపురం నుంచి అనంత‌పురం వ‌ర‌కూ ఇదే రీతిలో కూట‌మి ప్ర‌జాప్ర‌తినిధుల ధోర‌ణుల‌పై వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని అంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా కూట‌మి నేత‌ల దోపిడీపై ప్ర‌భుత్వ అనుకూల మీడియాలో అప్పుడ‌ప్పుడు వ‌చ్చే వ్య‌తిరేక క‌థ‌నాలు బ‌లం క‌లిగిస్తున్నాయి. చానా ముదురు అని ఓ ప‌త్రిక మంత్రి నారా లోకేశ్ కోట‌రీలోని నాయ‌కుడి దందాల గురించి రాసిన సంగ‌తి తెలిసిందే. బ‌దిలీలు, మైనింగ్‌లో దందాలు, అలాగే వివిధ ర‌కాల ప‌నుల‌ను ఇప్పిస్తానంటూ, లోకేశ్ పేరు దుర్వినియోగం చేస్తున్నార‌ని రాసిన సంగ‌తి తెలిసిందే.

అలాగే ఓ డార్లింగ్ మంత్రి హైద‌రాబాద్‌లో ఖ‌రీదైన హోట‌ల్‌లో మ‌కాం వేసి, గానాభ‌జానా ఏ ర‌కంగా చేస్తున్నారో అదే ప‌త్రిక రాసింది. ముఖ్య‌మైన శాఖ‌కు మంత్రిగా ఉంటూ, హైదారాబాద్‌కే ఫైళ్లు తెప్పించుకుని ప‌నులు చ‌క్క‌బెడుతున్నార‌ని రాసిన సంగ‌తి తెలిసిందే. పార్టీల‌కు అతీతంగా ఏ ఇద్ద‌రు సెల్‌ఫోన్‌ల‌లో మాట్లాడుకున్నా… మీ ఎమ్మెల్యే లేదా మంత్రి గురించి ఏమ‌నుకుంటున్నార‌ని ఆరా తీస్తున్నారు.

“ఏం చెప్తావులేబ్బా. గ‌తంలో వైసీపీ నాయ‌కుల అరాచ‌కాల్ని భ‌రించ‌లేక కూట‌మికి అధికారం క‌ట్ట‌బెట్టాం. కానీ వీళ్ల అరాచ‌కాలు, దోపిడీలు, దౌర్జ‌న్యాల‌తో పోల్చితే, వైసీపీ నాయ‌కులే న‌యం” అని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి. ఔనా మా ఎమ్మెల్యేనే అనుకున్నామో! మీ మంత్రి కూడా అంతేనా. “మా ఊళ్లో చికెన్ సెంట‌ర్ ద‌గ్గ‌రి నుంచి చిన్న దుకాణాల వ్యాపార‌స్తుల వ‌ర‌కు ఎమ్మెల్యేకు క‌ప్పం క‌ట్టాల్సిందే” అని నంద్యాల జిల్లాలోని ఒక నియోజ‌క‌వ‌ర్గ టీడీపీ నాయ‌కుడు వాపోవ‌డం గ‌మ‌నార్హం.

మంత్రి నారాయ‌ణ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న నెల్లూరు నియోజ‌క‌వ‌ర్గంలో కూడా అవినీతి ఆరోప‌ణ‌లున్నాయంటే న‌మ్మ‌గ‌ల‌మా? న‌మ్మి తీరాల్సిందే. నారాయ‌ణ పేరుతో ఇష్టానుసారం దోపిడీ సాగుతోంది. ఉభ‌య‌గోదావ‌రి జిల్లాల్లో దోపిడీలో తామేం త‌క్కువ కాద‌ని జ‌న‌సేన నేత‌లు నిరూపించుకుంటున్నార‌ని స‌మాచారం. తిరుప‌తి జిల్లాలోని ఓ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే ఏకంగా త‌మ పార్టీ కార్యాల‌యానికే రెవెన్యూ అధికారుల్ని పిలిపించుకుని, వివాదాస్పద స్థ‌లాలు, భూముల‌కు సంబంధించి సెటిల్‌మెంట్స్ చేసుకుంటున్నార‌నేది బ‌హిరంగ ర‌హ‌స్య‌మే.

ఇలా ఏ నియోజ‌క‌వ‌ర్గం చూసినా, ఏమున్న‌ది గ‌ర్వ‌కార‌ణం అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప‌ట్టుపోయింద‌నే అభిప్రాయం క‌లుగుతోంది. ఇదేమ‌ని ప్ర‌శ్నిస్తే, ఎన్నిక‌ల్లో కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశామ‌ని, రాబ‌ట్టుకోవాలి క‌దా? అని ఎదురు ప్ర‌శ్న వ‌స్తోంది. కూట‌మి నేత‌ల అరాచ‌కాలు, దోపిడీలు, దౌర్జ‌న్యాల పుణ్య‌మా అని, గ‌తంలో బాగా చెడ్డ పేరు తెచ్చుకున్న నాయ‌కులకు మంచి పేరు వ‌స్తోంద‌నే మాట వినిపిస్తోంది. లోకేశ్‌కు రెడ్‌బుక్‌, చంద్ర‌బాబుకు అమ‌రావ‌తి, ప‌వ‌న్‌కు గుడులు త‌ప్ప‌, మ‌రేవీ ప‌ట్ట‌డం లేద‌న్న విమ‌ర్శ బ‌లంగా వుంది. ఇప్ప‌టికైనా క్షేత్ర‌స్థాయిలో త‌ప్పుల్ని స‌రిదిద్దుకోక‌పోతే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుంది.

20 Replies to “హ‌లో.. మీ ఎమ్మెల్యే/ మంత్రి కూడా ఇంతేనా?”

  1. ఎన్ని చేసినా చిన్న టఃప్పును కూడా స్వంత మీడియా ఎత్తి చూపిస్తుంది సాక్షి లాగ చీకట్లో ఉంచదు అందుకే మనకి 11 కూటమి కి మాలా 29 లో అధికారం

  2. ఒరెయ్! అరాచకాలు, దొర్జన్యాలు ఎవరి హయాములొ జరిగాయొ అందరికీ తెలిసిందె!

    KV రావు ని బెదిరించి ఎలా పొర్ట్ రాయించుకుంది, ప్రబుత్వం మారాకా అయన కెసు పెట్టగానె పొర్ట్ అయనకి ఇచ్చెసె బెరం ఎలా కుదుర్చుకుంది అందరూ చూసారు!

  3. అది సరే..

    నిన్న వల్లభనేని వంశి గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ప్రశ్నిస్తూ.. 20 పేజీల ట్వీట్ వేసాడు కదా నీ జగన్ రెడ్డి..

    ఆ ట్వీట్ వార్త.. ఈ రోజు సాక్షి లో రాయలేదేంటబ్బా..

    అన్ని పేజీలు ఎగా దిగా చూసేసా.. ఒకటికి 10 సార్లు చెక్ చేశా.. ఫ్రంట్ పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో రాయాల్సిన వార్తని మొత్తానికి మింగేశారేంటి..?

    ..

    ఓహో.. వల్లభనేని వంశి ని వదిలించేసుకొన్నారా..?

    వాడు చేసిన వెధవ పనులను, నీచపు మాటలను వెనకేసుకొస్తే.. ఆంధ్ర లో జనాలు నోట్లో ఊస్తారని..భయపడ్డారా..

    ఇప్పుడు తెలిసిందా.. వ్యతిరేకత అంటే ఏంటో.. మిమ్మల్ని ఎంతగా వెంటాడుతోందో..

    మీ పాపాలను మీరు మూసేస్తే.. మాయమైపోవు.. జనాలు మిమ్మల్ని మాయం చేసినప్పుడే .. మసకబారుతాయి..

    ..

    వ్యతిరేకత గురించి నువ్వు కథలు దెంగకు .. నీ జగన్ రెడ్డి పాపాలను మూసిపెట్టి, వెనకేసుకొచ్చిన నీకు.. ఇంకొకరి తప్పులను ప్రశ్నించే అధికారమే లేదు.. అర్హత అంతకన్నా లేదు..

  4. కొంచెం ఆ పెద్ద చర్చ ఎక్కడో చెప్పవా? సెలవు పెట్టాను, ఏ పనీ లేదు. నేను కూడా అటెండ్ అవుతాను

    1. చర్చ జరగాల్సిన అసెంబ్లీ కె దిక్కులేదు…అప్పుడు వంకాయ్ బాబాయ్ ఇలాంటి జోకులు పేలుస్తుంటాడు….హ్యాపీ గ పెట్టిన సెలవును ఎంజాయ్ చేసుకోండి

  5. aa పత్రికి రాసింది ఈ ఛానల్ వేసింది అని చెప్పటమేనా నీకు సొంత న్యూస్ network లేదా ఏంటి రా ఎంకి?? ఎదవ సోది!!

    1. వ్యతిరేకత మొదలైపోయిందని ఫస్ట్ మంత్ నుండే స్టార్ట్ చేసేసారు..

      అధికారం లేకపోయేసరికి.. నిప్పుల్లో బతుకుతున్నట్టు ఫీల్ అవుతున్నట్టున్నారు..

      ..

      అందుకే వీళ్ళ “వ్యతిరేకత” లెక్కలకు విలువ ఉండదు..

  6. వ్యతిరేకత ఉంది అంటారు…కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చెయ్యరు…అది బాలట్ మీదనే జరుగుతుంది కదా..ప్రభుత్వం ఎంత అణచివేసిన ప్రజలు తీర్పు చెప్పాలి అనుకుంటే చెప్పే తీరుతారు లైక్ తెలంగాణా లో ఉప ఎన్నిక అలానే ఆంధ్ర లో పట్టభద్రుల ఎన్నిక లే ఉదాహరణలు ….బాధ్యతలు తప్పించుకోవానికి ఎదో సాకు….అవతల వాళ్ళ మీద ఏడవడానికి ఒక ఏడుపు కాదు….

  7. లెవనాన్నాయ..కూటమి govt మీద పిచ్చ పిచ్చ గా వ్యతిరేకత ఉంది మన 11 సీట్లు రాజీనామా చేసి, ఎన్నికలు తెప్పించి వాళ్లకు deposits కూడా రాకుండా చేద్దామా??

    మళ్ళీ గెలిచి “ప్యాలెస్ లో అసెంబ్లీ సెట్టింగ్” పెట్టుకుందాం.. ఏమంటావ్??

  8. సిద్ధమా..??

    వ్యతిరేకత వచ్చేసింది కాబట్టి, మావోడు బడ్జెట్ సమావేశాలకి అసెంబ్లీ కి వస్తాడట

    అచ్చన్నా.. ఒక గంట కాదు.. ఎన్నిగంటలయినా చూసుకుందాం మీ పేతాపము.. మావోడి పేతాపము

  9. అసలు ఇలాంటి పనులు చేయించిదే వాళ్ళు…. ఇంక పట్టించుకోవటం లేదు అనుకోవటం అమాయకత్వం

Comments are closed.