తండేల్ సినిమా.. మంచి సమీక్షలు వచ్చాయి, మంచి టాక్ వచ్చింది. కానీ మండే నుంచి సినిమా జారిపోయింది. ఎంత లేపుదామన్నా లేవడం లేదు కలెక్షన్లు. ఎందుకిలా అని కిందా మీదా అవుతోంది యూనిట్. లైలా.. విష్వక్ సేన్ సినిమా. ఇంతో అంతో బజ్ వుంది. బ్రహ్మానందం.. చిన్న సినిమా. ఈ రెండు సినిమాలు విడుదలయ్యాయి. కానీ బ్రహ్మానందం సినిమాకు చాలా చోట్ల టికెట్ లు తెగక షో లు పడలేదు. లైలా అనే సినిమాకు ఫుల్స్ రాలేదు. నూరు, నూట యాభై టికెట్ లు తెగాయి. ఎందుకిలా?
సినిమా జనాలు గ్రౌండ్ రియాల్టీ పట్టించుకోరు. ఎంతసేపూ ఆ సినిమా వచ్చి రెండు వారాలయింది. ఈ సినిమా రావడానికి ఇంకా వారం గ్యాప్ వుంది. ఇలాంటి పాతకాలం లెక్కలే చూస్తారు తప్ప ఇంకోటి కాదు. అంతకు ముందు ఏ సినిమా వచ్చింది. ఎంత హిట్ అయింది. ఎంత వసూలు చేసింది. జనాల దగ్గర డబ్బులు ఏమాత్రం వున్నాయి. ఇవేవీ ఆలోచించరు.
సంక్రాంతికి మూడు సినిమాలు వచ్చాయి. గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూడు సినిమాలు కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత తక్కువ లెక్క వేసుకున్నా నాలుగు వందల కోట్ల రూపాయలను వసూలు చేసేసాయి. మూడు నాలుగు వందల రూపాయలు అంటే చిన్న మొత్తం కాదు. రెండు రాష్ట్రాల ప్రజలు అంతా కలిసి అంత మొత్తం తమ జేబుల్లోంచి తీసి ఇచ్చేసిన తరువాత ఇంకా ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు.
అప్పటికీ సినిమా లవర్స్ మరి కొంచెం ఖర్చు చేసి తండేల్ సినిమాను చూసారు. అంతకు మించి ఖర్చు చేయలేని వారు ఓటిటి కోసం వేచి చూస్తున్నారు. లైలా, బ్రహ్మానందం లాంటి సినిమాలకు వచ్చాయి. వాటిని పూర్తిగా ఓటిటి కి వదిలేసారు. ఈ సంగతి, ఈ లెక్కలు చూసుకోరు. ఎందుకు రావడం లేదు జనాలు అని కిందా మీదా పడుతున్నారు.
ఏ నెల అయినా జనాలకు బడ్జెట్ కొంత మేరకే వుంటుంది. ఈ నెల సినిమాలకు ఇంత ఇవ్వలేము అని మిడిల్ క్లాస్ జనాలు డిసైడ్ అయి వుంటారు. ఒక్కోసారి ఎక్కువ పెట్టాల్సి వుంటుంది. సంక్రాంతి సినిమాలకు అలాగే పెట్టేసారు. మళ్లీ జనాలు డబ్బులు తీయాలంటే కనీసం నెల రోజల నుంచి రెండు నెలల గ్యాప్ కావాలి.
ఓటిటి అనేది ఒకటి వచ్చింది. ఆ సంగతి మరిచిపోకూడదు. మిడ్ రేంజ్, బిలో మిడ్ రేంజ్ సినిమాలను దానికి వదిలేసే మైండ్ సెట్ పెరుగుతోంది. సినిమా మరీ అద్భుతం అంటే తప్ప థియేటర్ కు రావడం లేదు. అటు కోట్లు ఇచ్చేసిన తరువాత మరీ అద్భుతాలు జరిగితే తప్ప థియేటర్ కు జనం రారు. ఆ గ్రౌండ్ రియాల్టీ ని తెలుసుకోవాలి. అప్పుడు సినిమాలు ప్లాన్ చేసుకోవాలి.
Nuv ne erri puv analysis
Good analysis
ప్లే బాయ్ జాబ్స్ >>> తొమ్మిది, తొమ్మిది, ఎనిమిది,
థియేటర్ లు సంవత్సరం మొత్తం కి ఇక ప్రేక్షకుడి కి సుమారు ఒక 2 వేలు 5 వందల రూపాయలు తీసుకుని, నెలకి ముడు సార్లు ఫ్రీ గా చూడవచ్చు అని ప్లాన్ పెట్టాలి.
ప్రీమియర్ సినిమాకి ఎక్సట్రా కట్టాలి, పాప్కార్న్ కి సొంత డబ్బు అని పెట్టాలి. అప్పుడే జనాలు హాల్ కి వచ్చి చూస్తారు. అప్పుడు హాల్ వాళ్ళకి, ప్రేక్షకుడికి లాభం.
Entha ott vachchina, theatre lo chusthe aa thrille veru. Kani ikkada samasya emitante ticket price, kanisam single theatre lo, chinna, pedda Ane, Theda lekunda, 30/-, 50/-, 100/- ticket rates pedithe minimum below average movie’s kuda janalu vachchi theatre lo chustaru. Theatre lo parking free ga petti, kwality food mrp rate ki ammithe,
Apudu theatre ki poorva vaibhavam vasthundi. Enno single screen theatres close avuthunnayi. Daniki Karanam ticket rate. Multiplex lo meeru entha pettukunna , no problem. Daniki vellevallu daniki veltharu. Single screens lo next 3,4 months summer just relax kosamaina theatre ki vastharu. Chinna example, thandel movie ki ee rates apply cheyandi. Minimum 1 month house full collections vasthayi.
Chiranjeevi family lo 11 mandhi hero’s vunnaru kulam fans kuda vunnaru. inkka week ki rendu movies release cheyachu





