జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై కేసు నమోదు

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై హైద‌రాబాద్‌లోని సైబ‌రాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేశారు.

తాడిప‌త్రి మున్సిప‌ల్ చైర్మ‌న్ జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై హైద‌రాబాద్‌లోని సైబ‌రాబాద్ పోలీసులు కేసు న‌మోదు చేశారు. సినీ న‌టి మాధ‌వీల‌త త‌న‌పై జేసీ అస‌భ్య‌క‌ర కామెంట్స్ చేశార‌నే ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు టీడీపీ నేత‌పై తెలంగాణ‌లో కేసు న‌మోదు కావ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

ఈ ఏడాది జ‌న‌వ‌రి 1న నూత‌న ఏడాదిని పుర‌స్క‌రించుకుని తాడిప‌త్రిలో జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి మ‌హిళ‌ల కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. అయితే మ‌హిళ‌ల‌పై అఘాయిత్యాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో నూత‌న సంవ‌త్స‌రంలోకి అడుగుపెడుతున్న ముందురోజు రాత్రి నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌కు వెళ్లే మ‌హిళ‌లు జాగ్ర‌త్త‌గా వుండాల‌ని మాధ‌వీల‌త హెచ్చ‌రించారు.

బీజేపీ నాయ‌కురాలైన మాధ‌వీల‌త కామెంట్స్‌తో మ‌న‌స్తాపం చెందిన జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి తీవ్ర అభ్యంత‌ర‌క‌ర కామెంట్స్ చేశారు. సినీన‌టిని వ్య‌భిచారిగా అభివ‌ర్ణించ‌డంతో తీవ్ర వివాదం చెల‌రేగింది. ఆ త‌ర్వాత మాధ‌వీల‌త‌కు జేసీ క్ష‌మాప‌ణ చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఆమె సంతృప్తి చెంద‌లేదు. సైబ‌రాబాద్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

మాధ‌వీల‌త ఫిర్యాదుపై కేసు న‌మోదు చేయ‌డానికి ఇంత‌కాలం ప‌ట్టింది. ఎట్ట‌కేల‌కు జేసీపై కేసు న‌మోదు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అయితే ఈ కేసు ఎంత వ‌ర‌కు ముందుకెళుతుందో చూడాలి.

2 Replies to “జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డిపై కేసు నమోదు”

  1. Madhavi లత. కుష్బూ. చిన్మయి. అనసూయ అటెన్షన్ సీకర్స్ వీళ్ళకి అటెన్షన్ కోసం ఆరాటం తప్ప ఏముందదు

Comments are closed.